హిందూమతం, వాస్తుశాస్త్రంలో ఇంట్లోని ప్రతి వస్తువుకు సంబంధించి నియమ నిబంధనలున్నాయి. ఈ నియమాల్ని పాటించకపోతే ఇంట్లో వివిధ రకాల వాస్తుదోషం ఏర్పడుతుంది. ముఖ్యంగా చెప్పులు తిరగేసి ఉంచడం వల్ల చాలా సమస్యలు ఎదురౌతాయి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంట్లో ప్రతి వస్తువు సరైన దిశలో, సరైన విధానంలో ఉండాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఆఖరికి ఇంటి బయట చెప్పులు కూడా సరైన విధానంలోనే ఉండాలి. అంటే చెప్పులు ఎప్పుడూ తిరగేసి ఉండకూడదు. ఈ విషయంపై చాలామందికి సందేహాలుంటాయి. చెప్పులు తిరగేసి ఉండటం వల్ల ఏమౌతుందో తెలియక కొంతమంది ఆందోళన చెందితే..మరి కొంతమంది తేలిగ్గా తీసుకుంటుంటారు. చెప్పులు తిరగేసి ఉంచితే ఇంట్లో కలహాలు ప్రారంభమౌతాయి. ధననష్టం వాటిల్లుతుంది. ఇంట్లో నెగెటివిటీ ఉంటుంది. అభివృద్ధిలో ఆటంకాలు ఎదురౌతాయి. అందుకే సాధారణంగా పెద్దలెప్పుడూ చెప్పులు సరిగ్గా పెట్టమని చెబుతుంటారు. 


చెప్పులు, షూలు తిరగేసి ఉంచడం అశుభమా


చెప్పులు తిరగేసి ఉంచితే ఇంట్లో పెద్దలు అభ్యంతరం చెబుతుంటారు. వాటిని సరిగ్గా ఉంచమని చెబుతుంటారు. దీనివెనుక ఓ కారణముంది. జ్యోతిష్యం ప్రకారం చెప్పులను శనితో ముడిపెడతారు. ఈ క్రమంలో చెప్పుల వి,యంలో జరిగే తప్పులు శని దేవుడికి ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. శనిదేవుడు ఆగ్రహం..ధననష్టం, అభివృద్ధిలో ఆటంకాలకు కారణమౌతుంది. అందుకే ఎప్పుడూ చెప్పుల్ని తిరగేసి ఉంచకూడదు. 


చెప్పుల దొంగతనం శుభమా


శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు చెప్పులు, షూలు దానం చేయడం ప్రయోజనకరంగా భావిస్తారు. శనివారం నాడు చెప్పులు దొంగతనానికి గురైతే దానర్ధం ఏదైనా పెద్ద కష్టం తప్పిపోయినట్టే. అందుకే చెప్పుల్ని దొంగిలించడం శుభంగా భావిస్తారు. అంతేకాకుండా చెప్పుల విషయంలో కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఎప్పుడూ ఇతరుల చెప్పులు లేదా షూ ధరించకూడదు. ఎందుకంటే ఇతరుల దరిద్రం, దురదృష్టం మనల్ని వెన్నాడుతుంది.


Also read: Venus Transit 2023: 6 రోజుల తరువాత ఈ రాశులవారికి ఊహించని ధనవర్షం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook