Fallen Coins, Notes Found on Roads: కొన్నిసార్లు మనం రోడ్డుపై నడుస్తున్నప్పుడు అక్కడ డబ్బులు ఏమైనా కనిపిస్తే మనం ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. ఇది అందరికీ చెప్పడానికి ఇష్టపడము కానీ ఆ సంతోషం మాత్రం ఖాయం. అయితే ఇలా వీధిలో దొరికిన డబ్బు భవిష్యత్తులో జరగబోయే శుభ మరియు అశుభ సంఘటనల గురించి క్లూ ఇస్తుందని మీకు తెలుసా..? అవును అలా రోడ్డు మీద దొరికిన ఈ డబ్బును ఏమి చేయాలి అనే గందరగోళం చాలా మందిలో ఉంది. కొందరైతే ఎంచక్కా తమ దగ్గర ఉంచుకుంటే, మరికొందరు అవసరమైన వారికి ఇస్తారు లేదా ఆలయానికి విరాళంగా ఇస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ, రోడ్డున పడిన డబ్బును అసలు తీసుకోవచ్చా..? తీసుకుంటే ఆ డబ్బుతో ఏమి చేయాలి ?రోడ్డుపై డబ్బు దొరకడం శుభమా, అశుభమా..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.  డబ్బును రోడ్డున దొరకడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, పడిన ధనాన్ని పొందడం పూర్వీకుల ఆశీర్వాదంగా పరిగణించబడుతుంది. ఈ క్రమంలో మీరు పూర్తి శ్రమతో పని చేస్తే, మీరు ఖచ్చితంగా దాని ఫలితాన్ని పొందుతారు. అంతేకాదు  మీరు భవిష్యత్తులో మంచి అదృష్టాన్ని పొందుతారని  కూడా అలా డబ్బు దొరకడం సూచిస్తుంది. 


- మీరు వర్క్ పూర్తి నుంచి ఇంటికి తిరిగి వస్తుంటే, మీకు దారిలో రోడ్డు మీద డబ్బు దొరికితే మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారనడానికి సంకేతం. లేదా కొన్ని శుభవార్తలు అందుకోవచ్చనడానికి సంకేతమట. 


- వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం ఎక్కడికైనా వెళ్తుండగా, ఆ సమయంలో దారిలో పడిపోయిన నాణెం లేదా నోటు కనిపిస్తే, మీరు ఖచ్చితంగా మీ పనిలో విజయం సాధిస్తారని సంకేతంమట.


- మీరు వెళుతున్న దారిలో ఏదైనా న నాణెం కనుగొంటే, త్వరలో మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చని, ఈ పని మీకు విజయం మరియు డబ్బు రెండింటినీ ఇస్తుందని సంకేతమట. 


దొరికిన డబ్బును ఇలా వాడండి 


మీరు రోడ్డుపై పడి ఉన్న డబ్బులు కనుగొంటే, దాన్ని దేవాలయంలో దానం చేయండి లేదా మీరు దానిని మీ పర్సులో లేదా మీ ఇంట్లో ఎక్కడైనా ఉంచుకోవచ్చు, కానీ వాస్తు ప్రకారం దాన్ని ఖర్చు చేయకూడదు, అలా చేస్తే అరిష్టం. 


Also Read: Budh Gochar 2023: జూన్ 7 నాటికి, ఈ 3 రాశుల వారికి ఊహించని ఆర్థిక సమస్యలు.. మామూలు దెబ్బ కాదిది!


Also Read: Surya Gochar 2023: సూర్య గోచారం దెబ్బ.. ఈ ఐదు రాశుల వారు అబ్బా.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook