Vastu Tips: దేవుడికి పెట్టిన పూలను ఇలా తొందరగానే తీసి వేయాలి.. లేదంటే ఈ సమస్యలు తప్పవు..!
Vastu Tips: వాస్తు శాస్త్రంలో ప్రతిదానికీ కొన్ని నియమాలు ఉన్నాయి. అందులో పుష్పాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలు పేర్కొన్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని వాస్తు నిపుణులు తెలుపుతున్నారు.
Vastu Tips: వాస్తు శాస్త్రంలో ప్రతిదానికీ కొన్ని నియమాలు ఉన్నాయి. అందులో పుష్పాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలు పేర్కొన్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని వాస్తు నిపుణులు తెలుపుతున్నారు. హిందూ ఆచారం ప్రకారం.. ప్రతి పుష్పాన్ని పూజ కార్యక్రమంలో వినియోగించుకోవచ్చు. ఇంట్లో వివాహం జరిగినా, గృహ ప్రవేశం జరిగినా, ఏదైనా పూజాది కార్యక్రమాలు జరిగినా, అన్నింటిలోనూ తాజా పుష్పాలను వాడుతూ ఉంటారు.
కానీ వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పూజలో వాడే పూలు దేవునికి సమర్పించిన వెంటనే తొలగించాలి. ఎండిన పువ్వులు ఇంట్లో ప్రతికూలతను సూచిస్తాయని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కుటుంబంలో తగాదాలు, గొడవలు మొదలవుతాయని నిపుణులు తెలుపుతున్నారు.
ఎండిన పువ్వులు మృతదేహాల వంటివి:
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఉంచిన ఎండిన పువ్వులు మృతదేహాంగా శాస్త్రంలో భావిస్తారు. అదేవిధంగా ఎండు పువ్వులను ఎప్పుడు ఇంట్లో ఉంచకూడదు. దేవుడికి సమర్పించే తాజా పుష్పాలన్నీ పవిత్రంగా మారుతాయని గ్రంధాలలో పేర్కొంది. కాబట్టి పూజ చేసిన వెంటనే వాటిని తొలగించాలి. శాస్త్రాల ప్రకారం.. వాటిని సకాలంలో తొలగించకపోతే, చండాలి, చందాంశు, విశ్వకసేన్ వంటి ప్రతికూల శక్తులు ఇంట్లో మొదలవుతాయి.
పూజ నుంచి తీసివేసిన పువ్వులను ఏమి చేయాలి:
పూలు ఎండిపోక ముందే దేవుడి ఫోటోల నేంచి తీసేయాలని శాస్త్రం పేర్కొంది. పూజల నుంచి తొలగించిన పువ్వులను ఏమి చేయాలో ప్రజలు గందరగోళానికి గురవుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎండిన పూజ పువ్వులను నీటిలో లేదా నదిలో వేయాలి. లేదా వాటిని పవిత్రమైన చెట్టు మూలంలో పాతిపెట్టండి. అంతే కాకుండా మీ ఇంట్లోని కుండీలలో కూడా ఈ పూలను పెట్టుకోవచ్చు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook