Venus Transit 2023: త్వరలో కుంభంలోకి శుక్రుడు... ఈ రాశులకు మంచి రోజులు ప్రారంభం...
Venus Planet Transit 2023: మరికొన్ని రోజుల్లో ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మూడు రాశుల వారి అదృష్టం మారనుంది.
Venus Gochar In Kumbh: జ్యోతిష్య శాస్త్రంలో కీర్తి, సంపద, ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ కు ప్రతీకగా శుక్ర గ్రహాన్ని భావిస్తారు. అందుకే శుక్రుని గమనంలో చిన్న మార్పు వచ్చిన సరే దాని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. జనవరి 22న శుక్రుడు కుంభరాశిలో సంచరించబోతున్నాడు. పైగా శనిదేవుడు కుంభరాశికి అధిపతి. ఆస్ట్రాలజీ ప్రకారం, శని మరియు శుక్రుడు స్నేహితులు. దాని వల్ల శుక్రుడు శుభఫలితాలను ఇస్తాడు. కుంభంలో శుక్రుడి సంచారం ఏ రాశి వారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
శుక్రుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేషం (Aries): కుంభరాశిలో శుక్రుని సంచారం మేష రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి ఆదాయ గృహంలో సంచరించబోతున్నాడు. దీని కారణంగా మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. మీరు మానసిక సమస్యలతోపాటు ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడతారు. పాత పెట్టుబడి నుండి ప్రయోజనం పొందుతారు. మీ కెరీర్ ముందుకు సాగే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా మునుపటి కంటే బలపడతారు.
మకరం (Capricorn): శుక్రుడి రాశి మార్పు మీ సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ నుండి రెండవ ఇంటికి బదిలీ అవుతుంది. దీంతో మీరు ఏ వ్యాపారం చేసినా అందులో సక్సెస్ అవుతారు. డబ్బును ఆదా చేస్తారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. అనేక విధాలుగా మీ దగ్గరకు డబ్బు వస్తుంది.
కన్యా రాశి (Virgo): శుక్రుని సంచారం కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీ జాతకంలో ఆరవ ఇంట్లో సంచరించబోతున్నాడు. మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు బిజినెస్ లో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.