Venus Transit 2023: శుక్ర గోచారం ప్రభావం, మే 2 నుంచి ఆ రాశికి తస్మాత్ జాగ్రత్త
Venus Transit 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి జ్యోతిష్యంలో విశేష ప్రాధాన్యత, మహత్యముంది. కొన్నింటి ప్రభావం అనుకూలంగా ఉంటే, మరి కొన్నింటి ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Venus Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారుతుంటుంది. ఇలా రాశి పరివర్తనం ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది. శుక్ర గ్రహం మిధున రాశిలో ప్రవేశించనుండటంతో ఈ రాశి జాతకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.
శుక్రుడు మే 2వ తేదీ మద్యాహ్నం 2.33 గంటలకు మిథున రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో శుక్రగ్రహం 28 రోజులపాటు ఉంటాడు. మే 30వ తేదీ సాయంత్రం 7.40 గంటలకు కర్కాటక రాశిలో రాశి పరివర్తనమౌతుంది. మిధున రాశిలో శుక్రుడి గోచారం ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. శుక్రుడు పరివర్తనం వృషభ రాశివారిపై గణనీయంగా పడనుంది. ప్రత్యేకించి ఉద్యోగస్థులు చాలా అప్రమత్తంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు పరుష పదజాలం ఉపయోగించకూడదు. మీ డాక్యుమెంట్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంట్లో లైబ్రరీని శుభ్రంగా ఉంచుకోవాలి.
వ్యాపారులైతే బ్యాంక్ బ్యాలెన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పొదుపుపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకావు. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. ఎందుకంటే రానున్న సమీప భవిష్యత్తులో పెట్టుబడుల అవసరముంటుంది. అందుకే చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుంది. యువ గాయకులకు అనువైన సమయంగా చెబుతున్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ఆధారంగా పని చేస్తారు. ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్లు అందరి మాటను గౌరవించాలి. శుక్రుడి గోచారం కారణంగా వజ్రం లేదా ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీ కొనుగోలు ఉంటుంది.
అయితే ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ధ్యాస అవసరం. అప్రమత్తంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం పొందుతారు. స్థూలకాయం, డయాబెటిస్ , అధిక రక్తపోటు రోగులు జాగ్రత్తగా ఉండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook