Venus Transit in Leo 2022: లగ్జరీ లైఫ్, ప్రేమను అందించే శుక్రుడు ఇవాళ సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే సింహరాశిలో గ్రహాల రాజు సూర్యుడు ఉన్నాడు. అయితే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 23 వరకు శుక్రుడు సింహరాశిలో (Venus Transit in Leo 2022) ఉంటాడు. సింహరాశిలో శుక్ర సంచారం 5 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్కీ రాశులివే...
మేషం (Aries): శుక్రుని సంచారం మేష రాశి వారికి కెరీర్ లో పురోగతిని ఇస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. సంతానం కలగాలనే కోరిక నెరవేరుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. పెళ్లికాని వారికి వివాహం అయ్యే అవకాశం ఉంది. 


వృషభం (Taurus): ఈ రాశికి అధిపతి శుక్రుడు కావడం వల్ల శుక్రుడు రాశిలో మార్పు రావడం వృషభ రాశి వారికి విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ వ్యక్తుల జీవితంలో సంపద, వైభవం, ఐశ్వర్యం పెరుగుతాయి. మీరు కారు లేదా ఏదైనా విలువైన వస్తువును కొనుగోలు చేయవచ్చు. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.


సింహం (Leo): శుక్ర గ్రహం సింహరాశిలోకి మాత్రమే ప్రవేశిస్తోంది. దీంతో ఈ రాశివారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. మెుత్తం మీద ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.  


తుల (Libra): శుక్రుడు తుల రాశికి కూడా యజమాని కాబట్టి శుక్రుని సంచారం ఈ రాశివారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ కెరీర్‌ దూసుకుపోతుంది. 


కుంభం (Aquarius): శుక్రుడు రాశిలో మార్పు కూడా కుంభ రాశి వారికి శుభ ఫలితాలనిస్తుంది. పెళ్లికి అడ్డంకులుంటే తొలగిపోతాయి. వ్యాపారులు భారీగా లాభాలు పొందుతారు. 


Also Read: Vakri Grah 2022: కన్యారాశిలో బుధుడు తిరోగమనం... ఈ 3 రాశులకు బంపర్ బెనిఫిట్స్! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook