Venus Zodiac Change 2022: దైత్య గురువు శుక్రాచార్యుడు సెప్టెంబర్ 24న రాశిని మార్చబోతున్నాడు. శుక్ర గ్రహం తన శత్రువు సూర్యుని రాశి అయిన సింహరాశిని విడిచిపెట్టి సెప్టెంబర్ 24న తన మిత్రుడైన బుధుని రాశి అయిన కన్య రాశిలోకి (venus Transit in virgo 2022) ప్రవేశించనున్నాడు. అక్టోబరు 18 వరకు అక్కడే ఉంటాడు.  ఏదైనా గ్రహం యొక్క రాశిచక్రం యొక్క మార్పు అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. అయితే శుక్రగ్రహం రాశి మార్పు మకరరాశివారిపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్యారాశిలో లక్ష్మీనారాయణ యోగం..
శుక్రుని రాకతో మకర రాశి వారు ప్రేమలో విజయం సాధించి..దానిని పెళ్లి వరకు తీసుకెళతారు. వివాహం నిర్ణయం తీసుకోవడానికి ఇది శుభ సమయం. ఈ సమయంలో శుక్రుడు తన మిత్రుడైన బుధునితో కలసి కన్యారాశిలో నీచమైన రాజయోగంతో పాటు లక్ష్మీ నారాయణ యోగాన్ని సృష్టిస్తున్నాడు. శుక్రుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు బలహీనుడు అవుతాడు, కానీ తన మిత్రుడైన బుధుడు అండ ఉండటంతో అతడు ఉచ్ఛస్థితికి సమానమైన బలాన్ని కలిగి ఉంటాడు. మరో విశేషమేమిటంటే, ఈ సమయంలో రాహువు మరియు కేతువులు శుక్రుడు మరియు బుధుడు కలయికపై ఎటువంటి ప్రభావం చూపించరు. 


మకరరాశిపై శుక్ర సంచార ప్రభావం
శుక్ర సంచారం, లక్ష్మీనారాయణ యోగం వల్ల మకరరాశివారు శుభఫలితాలను పొందుతారు. అదృష్టంతో ఈ రాశివారి కెరీర్ లో పురోగతి ఉంటుంది.  నిరుద్యోగులు MNC కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం ఉంది. మార్కెటింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ సమయంలో లాభపడతారు. సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. మీరు మంచి పొజిషన్ కు వెళతారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భారీగా డబ్బు సంపాదిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. పెళ్లికాని యువతీయువకులకు వివాహమయ్యే అవకాశం ఉంది. 


Also Read: Shukra Asta 2022: ఇవాళ సింహరాశిలో అస్తమించనున్న శుక్రుడు... ఈ రాశులవారికి డబ్బే డబ్బు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook