Shukra Gochar in Meena Rashi 2023: పురాణాల ప్రకారం, రాక్షసులకు గురువుగా శుక్రాచార్యుడిని భావిస్తారు. అతడి పేరు గ్రహానికి పెట్టారు. అష్ట గ్రహాల్లో ఒకటైన శుక్ర గ్రహం ప్రస్తుతం తన సొంత రాశి అయిన తులరాశిలో సంచరిస్తుంది. డిసెంబరు 25 వరకు అదే రాశిలో ఉండనుంది. తులరాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల విలోమ లేదా వ్యతిరేక లేదా విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, 6, 8, 12 గృహాల అధిపతులు వారి సొంతరాశుల్లోకి ప్రవేశించనప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. తులరాశి యెుక్క ఎనిమిదో ఇంటికి శుక్రుడు అధిపతి. దీని కారణంగానే విలోమ రాజయోగం సంభవించింది. ఈ యోగాన్ని జ్యోతిష్యశాస్త్రంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ అరుదైన యోగం వల్ల మూడు రాశులవారు అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని పొందనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృశ్చికం: రాజయోగం వృశ్చిక రాశికి ఎంతో మేలు చేస్తుంది. మీకు లక్ కలిసి వస్తుంది. మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ స్కిల్స్ పెరుగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. 


మీనం: శుక్రుడు తులరాశి ప్రవేశం మీనరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు కష్టాలన్నీ తొలగిపోతాయి. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 


వృషభం: మేషరాశి వారికి విపరీత రాజయోగం కూడా చాలా లాభాలను ఇస్తుంది. మీకు ఈ సమయంలో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. మీ లవ్ సక్సెస్ అవుతోంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ ఆదాయం డబల్ అవుతోంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతోంది. మీరు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. 


Also Read: Grah gochar 2024: కొత్త సంవత్సరంలో ధనవంతులు కాబోతున్న రాశులివే..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook