హిందూమతంలో విజయ ఏకాదశిని అత్యంత ప్రాధాన్యత కలదిగా భావిస్తారు. ఆ రోజున వ్రతం ఆచరించి..విష్ణు భగవానుడిని పూజిస్తే..అంతా శుభం జరగడమే కాకుండా..ప్రతి పనిలో విజయం లభిస్తుందని నమ్మకం. ఈ సందర్భంగా ఏయే రాశులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది విజయ ఏకాదశి పర్వదినం డిసెంబర్ 19, 2022 న ఉంది. ఈ రోజు చాలా మహత్యమైనది. ప్రత్యేకమైంది. చాలా ఏళ్ల తరువాత ఇలాంటి సంయోగం ఏర్పడనుంది. విజయ ఏకాదశి రోజున ఒకేసారి 3 శుభ యోగాలు జరగనున్నాయి. బుధాదిత్య యోగం, లక్ష్మీ నారాయణ యోగం త్రిగ్రహ యోగం  కారణంగా..విజయ ఏకాదశి మహత్యం మరింతగా పెరిగిపోతుంది. ఈ నేపధ్యంలో విజయ ఏకాదశి వ్రతం ఆచరిస్తే పలు రెట్లు లాభం కలగనుంది.


4 రాశులకు మెరవనున్న జాతకం


విజయ ఏకాదశి రోజున ధనస్సు రాశిలో 3 శుభయోగాలు ఏర్పడనున్నాయి. బుధాదిత్య యోగం, లక్ష్మీ నారాయణ యోగం, త్రిగ్రహ యోగాల శుభ సంయోగం 4 రాశులకు అత్యంత శుభసూచకం కానుంది. ఈ సందర్భంగా ఏ రాశులకు శుభ సూచకం కానుందనే వివరాలు తెలుసుకుందాం..


వృషభరాశి


విజయ ఏకాధి నాడు ఏర్పడనున్న 3 శుభయోగాలు వృషభరాశి జాతకులకు అత్యంత శుభసూచకం కానుంది. ఈ జాతకులు ఊహించనివిధంగా ధనలాభం కలగనుంది. కెరీర్‌లో భారీ విజయం లభిస్తుంది. మీ వాయిస్ మీకు ప్లస్ అవుతుంది. పెద్ద పెద్ద పనులు సులభంగా చేస్తారు. పెళ్లి ఖరారౌతుంది. 


తులరాశి


డిసెంబర్ 19, 2022న ఏర్పడనున్న 3 శుభయోగాలు తులరాశి జాతకుల అదృష్టం ఒక్కసారిగా వికసిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో భారీ విజయం లభిస్తుంది. పదవి, డబ్బు, ప్రతిష్ట లభిస్తాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.


ధనస్సు రాశి


విజయ ఏకాదశి నాడు 3 శుభయోగాల అద్భుత సంయోగం ధనస్సురాశిలో ఏర్పడనుండటంతో..ఊహించని అంతులేని సంపద లభిస్తుంది. ఈ జాతకాలవారికి భాగ్యం వికసిస్తుంది. పదోన్నతి లభిస్తుంది. భారీగా ధనలాభం కలుగుతుంది. నలువైపులా లాభాలు ఆర్జిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.


మీనరాశి


మీనరాశి వారికి గోల్డెన్ డేస్‌గా చెప్పవచ్చు. ఉద్యోగం గురించి అణ్వేషించేవారికి కొత్త ఉద్యోగావకాశాలులభిస్తాయి. పదోన్నతి లభిస్తుంది. కెరీర్‌లో లభించే గొప్ప అవకాశం జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. ధనలాభం కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది.


Also read: Shani Rashi Parivartan 2023: కుంభ రాశిలోకి శని.. ఆ రాశుల వారంతా రెండు నెలల పాటు డబ్బు పొందడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook