Vishnu Rekha In Palm: మీ అరచేతిలో విష్ణు రేఖ ఉంటే కుబేరులతో సమానం.. ఈ రేఖ ఉందో లేదో చెక్ చేసుకోండి!
Vishnu Rekha In Palm In Telugu: రేఖా శాస్త్రం ప్రకారం మీ అరచేతిలో విష్ణు రేఖ ఉంటే జీవితాంతం అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా డబ్బు పరంగా వీరు కుబేరులతో సమానం. అలాగే వ్యాపారాల్లో ఊహించని ధన లాభాలు కూడా కలుగుతాయి.
Vishnu Rekha In Palm In Telugu: రేఖా శాస్త్రంలో అరచేతిలో ఉండే రేఖలను బట్టి జీవితంలో జరగబోయే శుభ అశుభ పరిణామాలు గురించి క్లుప్తంగా వివరించారు అలాగే ఈ రేఖల వల్ల ప్రభావితమయ్యే జీవితాన్ని కూడా పేర్కొన్నారు. అరచేతిలో అందరికీ విభిన్నమైన రేఖలు ఉంటాయి. ఇవి జీవితంలో ఆశుభ శుభ పరిణామాలను సూచిస్తాయి. ముఖ్యంగా కొన్ని రేఖలు జీవితంలో వ్యక్తుల అపారమైన సంపదకు కీర్తికి గౌరవం దాంపత్య జీవితానికి, ఎదుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. ఇలాంటి రేఖలు విష్ణు రేఖ కూడా ఒకటి మీ అరచేతిలో విష్ణు రేఖ ఉంటే, జీవితంలో ఎలాంటి సమస్యలనైనా సులభంగా ఎదుర్కొంటారు. దీంతో పాటు అదృష్టం కూడా ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. అలాగే వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా ఈ రేఖ ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ ఉద్యోగాలు ప్రమోషన్స్ పొందడమే కాకుండా కార్యాలయాల్లో ప్రశంసలు పొందుతారు. ఇవే కాకుండా ఈ విష్ణు రేఖ ఉన్నవారికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
ఈ విష్ణు రేఖ చేతిలో ఎక్కడ ఉంటుంది..
రేఖా శాస్త్రం ప్రకారం అరచేతిలో మీ మెయిన్ హృదయ రేఖ నుంచి ఒకరేఖ అదనంగా ఏర్పడి.. బృహస్పతి ఉండే పై భాగంలోకి ఆ రేఖ వెళుతుంది. ప్రధానంగా చెప్పాలంటే మీ చేతిలో మెయిన్ రేఖ రెండు భాగాలుగా చివరికి విభజించబడుతుంది. ఇలా విభజించబడిన చివరి రేఖనేయ విష్ణు రేఖగా పిలుస్తారు. ఎవరికైతే ఈ రేఖ చాలా క్లియర్ గా ఉంటుందో వారికి వ్యక్తిగత జీవితంలో సంపాదనకు ధనానికి ఎలాంటి లోటు ఉండదు. అయితే ఈ రేఖ క్లియర్గా లేని వారికి జీవితం యధావిధిగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
జీవితాంతం వీరికి అదృష్టమే అదృష్టం..
ఈ విష్ణు రేఖ కలిగి ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ శ్రీమహావిష్ణువుని అనుగ్రహాన్ని పొందుతారని రేఖా శాస్త్రంలో పేర్కొన్నారు. దీనికి కారణంగా వీరికి జీవితాంతం డబ్బు లభించడమే కాకుండా సమాజంలో ఉన్నత స్థానంలో జీవించగలుగుతారు. దీంతోపాటు సమాజ సేవ చేసే వారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అంతేకాకుండా ఎప్పుడైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ సులభంగా పరిష్కారమవుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు వృత్తిపరమైన జీవితం కొనసాగిస్తున్న వారికి జీవితంలో వచ్చి సవాళ్లు ఎంతో సులభంగా ఎదుర్కోగలుగుతారు. అలాగే వీరు ఎలాంటి కష్టతరమైన పనైనా ఎంతో సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా వీరు ఏ రంగంలో పనిచేసిన ఉన్నత స్థానానికి చేరుకునే గొప్ప శక్తిని కలిగి ఉంటారు. ఇక వ్యాపారాలు చేసే వారి విషయానికొస్తే వీరికి ఎలాంటి లోకా ఉండదు..పోటీ ఉండదు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
విష్ణు రేఖ చేతిలో క్లియర్ గా ఉన్నవారికి వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని రేఖా శాస్త్రంలో పేర్కొన్నారు. అలాగే వీరి భాగస్వామి కూడా జీవితంలో ఎంతో ఆనందంగా అదృష్టాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరు ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేసిన విజయాలు సాధించేందుకు అద్భుతమైన శక్తిని పొందగలుగుతారు. అలాగే సమాజంలో మంచి గౌరవంతో పాటు పేరును పొందగలుగుతారు. అప్పుడప్పుడు వైవాహిక జీవితంలో చిన్న సమస్యలు వచ్చినప్పటికీ సులభంగా పరిష్కారం అవుతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి