Weekly Horoscope 18 to 24 December 2023 in Telugu: మనలో చాలా మంది జ్యోతిష్యాన్ని నమ్ముతారు. వీరు లైఫ్ లో రేపు ఏం జరగబోతోందనని ముందుగానే తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో జ్యోతిష్యుడిని కలిసి తన ప్యూచర్ గురించి అడిగి తెలుసుకుంటారు. ఆస్ట్రాలజీ ప్రకారం, రాబోయే వారం ఎవరికి అనుకూలంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిసెంబరు నెల 18 నుంచి 24 తేదీ వరకు కొన్ని రాశులవారికి చాలా బాగుంది. ఎందుకంటే వచ్చే వారంలోనే బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. దీంతోపాటు గురుడు, శుక్రుడు యెుక్క దృష్టి కూడా ఈ రాశులపై పడనుంది. ఈ గ్రహాల స్థితి కారణంగా రాబోయే వారం నాలుగు రాశులవారు నక్క తోక తొక్కనున్నారు. జాతకరీత్యా వీరి కెరీర్ ఉన్నత స్థాయిలో ఉండటంతోపాటు సంపద కూడా భారీగా పెరుగుతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


తుల: రాబోయే వీక్ లో చాలా కాలంగా ఎదురు చూస్తున్న జాబ్ వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మీ ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది. 
వృశ్చికం: ఈ నెల మూడో వారం వృశ్చిక రాశి వారికి చాలా బెనిఫిట్స్ ను ఇవ్వనుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ పని లేదా బిజినెస్ కారణంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. 


Also Read: Guru Pushya Yoga: త్వరలో చివరి గురు పుష్య యోగం.. ఇలా చేస్తే కోటీశ్వరులే..!


మేషం: డిసెంబర్ మూడవ వారంలో మేషరాశి వారు కెరీర్ కు సంబంధించిన శుభవార్తను వింటారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీకు ఇప్పుడున్న జాబ్ కంటే పెద్ద ప్యాకేజీతో మంచి ఉద్యోగం వస్తుంది. ఈ వారంలో పెట్టే పెట్టుబడులు వల్ల మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. మీరు ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది.  
కర్కాటకం: వచ్చే వారంలో కర్కాటక రాశి వారి ఏ పని తలపెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ఫ్యామిలీ అండ్ ప్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. మీరు ఉద్యోగ లేదా వ్యాపారం లేదా పర్సనల్ నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. 


Also Read: Sun Mercury Conjunction 2023: మరో 24 గంటల్లో ఈ 3 రాశుల దశ తిరగబోతోంది..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook