Weekly Tarot Horoscope: టారో కార్డ్ రీడింగ్ ప్రకారం.. ఈ వారం 4 రాశుల వారికి బాగా కలిసిరానుంది. ఆ 4 రాశుల వారికి ఈ వారం అనేక అవకాశాలు, శుభవార్తలు ఉంటాయి. కాయవల్లి హీలింగ్ సెంటర్ వ్యవస్థాపకురాలు, టారో కార్డ్ రీడర్ ఆచార్య రణ్‌మీత్ కౌర్ ఈ వారం టారో రీడింగ్‌కి మనకు తెలియజేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries)


నైట్ ఆఫ్ స్వోర్డ్ కార్డ్ ఈ వారం ఫీల్డ్‌ వర్క్ చేసేవారికి ఈవారం మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్థలు తలెత్తుతాయి. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి.


వృషభ రాశి (Taurus)


పాత వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. తోబుట్టువులతో సంబంధాలు మెరుగవుతాయి. సత్యమే మీ బలం. జీవితంలో సమతుల్యతను సృష్టించగలుగుతారు. ఇల్లు మారడం లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయడం జరగవచ్చు. అనుకోని ప్రయాణానికి అవకాశాలు ఉన్నాయి. పెరుగుతున్న ఖర్చులు మనస్సును కలవరపరుస్తాయి.


మిథున రాశి (GEMINI)


ఈ వారం చాలా అదృష్టవంతులు. ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి. ప్రస్తుతం కొనసాగుతున్న రంగంలో విజయం సాధిస్తారు. ధనలాభం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.


కర్కాటక రాశి (Cancer) 


కర్కాటక రాశి వారికి ఈవారం మానసిక శ్రమ అధికం. భావోద్వేగానికి లోనుకావడం కుటుంబ సంబంధాలను చెడగొడుతుంది. తలనొప్పి, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తవచ్చు. సంతానానికి సంబంధించి కొన్ని శుభవార్తలు అందుకుంటారు.


సింహ రాశి (LEO)


ఈవారమంతా ప్రేమతో ప్రభావితమవుతుంది. పాత సమస్యలు పరిష్కరించబడతాయి. అందరితో మీ సంబంధాలు బలపడుతాయి. ధన లాభంతో మనసు సంతోషిస్తుంది. కడుపు నొప్పి, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.


కన్య రాశి (Virgo)


ఈ వారం వైవాహిక జీవితంలో కొత్తదనం ఉంటుంది. మీరు అవివాహితులైతే మీ భాగస్వామిని కలిసే అవకాశాలు ఉన్నాయి. మీరు కొనసాగుతున్న రంగంలో ప్రత్యేక విజయాన్ని పొందుతారు, దీని కారణంగా ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది.


తులా రాశి (Libra)


ఈ వారం భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడానికి సరైనది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. తల్లి వైపు నుంచి సహకారం అందుతుంది. పాత గాయం మళ్లీ తెరపైకి వస్తుంది. మానసిక క్షోభను కలిగిస్తుంది. కడుపునొప్పి సమస్య ఉంటుంది.


వృశ్చిక రాశి (Scorpio)


ఈ వారం కొన్ని ఉత్తేజకరమైన సంఘటనలు లేదా ప్రయాణాల కారణంగా మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. ఈ వారం థ్రిల్స్, సర్ప్రైజ్‌ల కోసం సిద్ధంగా ఉండండి. కాల ప్రవాహంలో కొట్టుకుపోండి. మీదైనా ప్రణాళికలతో ముందుకెళ్లండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.


ధనుస్సు రాశి (Sagittarius)  


ఈ వారం మీరు భావోద్వేగానికి గురవుతారని, వివాదాల్లో చిక్కుకుంటారని స్వోర్డ్ కార్డ్ పేజీ సూచిస్తోంది. ఈ వారం ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది, కానీ వారం చివరలో డబ్బుకు లోటు ఉండదు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అత్తమామల వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు.


మకర రాశి (Capricorn) 


ఈ వారం వైవాహిక జీవితంలో వివాదాల వల్ల మనస్సు ఇబ్బంది పడుతుంది. ఆఫీసు పనుల్లో అడ్డంకులు మిమ్మల్ని కలవరపరుస్తాయి. వారం చివరిలో అడ్డంకుల నుంచి ఉపశమనం పొందుతారు. ఈవారం ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.


కుంభ రాశి (Aquarius)


ఈ వారం మీరు విద్యా రంగంలో విశేష విజయాన్ని పొందుతారు. ఉన్నత అధికారుల నుంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. పాత సమస్యలు అంతమై సుసంపన్నమైన భవిష్యత్తు వైపు పయనిస్తాం. వైవాహిక జీవితంలో కొంత ఉదాసీనత ఉంటుంది.


మీన రాశి (Pisces) 


ఈ వారం కొన్ని పెద్ద వార్తలు వింటారు. అది మిమ్మల్ని కలవరపెడుతుంది. కోపం మంచిది కాదు. అది మీకే హానీ తలపెడుతుంది. రాజకీయ కార్యకలాపాలలో విజయం సాధిస్తారు. ఈ వారం మతపరమైన, ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల వైపు దృష్టి సారిస్తారు.



Also Read: Anand Mahindra: అగ్నివీరులకు బంపర్‌ ఆఫర్.. ఉద్యోగమిస్తామన్న ఆనంద్‌ మహీంద్రా


Also Read:Raj Yog: 30 ఏళ్ల తర్వాత అద్భుత గ్రహ సంయోగం.. పంచ మహాపురుష రాజయోగంతో 4 రాశుల వారికి అపార సంపద..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook