COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Weekly Horoscope Telugu: ఈ వారంలో జ్యోతిష్య శాస్త్రంలో అతి ప్రాముఖ్య కలిగిన కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. వీటి ప్రభావం అన్ని రాశులవారిపై సమానంగా పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఈ గ్రహ సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారి జాతాకాల్లో శుభ స్థానాల్లో ఉంటే, మరికొన్ని కొందరి జాతకాల్లో ప్రతికూల స్థానాల్లో ఉండబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారు ఈ వారం ప్రయోజనాలు పొందితే, మరికొన్ని రాశులవారు తీవ్ర దుష్ప్రభావాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వారం ఏయే రాశులవారికి మంచి జరగబోతుందో, ఏయే రాశులవారు దుష్ప్రభావాల బారిన పడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మేష రాశి:
ఈ వారం మేష రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఈ వారం కుటుంబంతో కలసి పూర్తిగా ఎంజాయ్‌ చేస్తారు. దీంతో పాటు వీరు రుచికరమైన ఆహారాలు తినే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారం మొత్తం ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా ప్రేమ జీవితం గడుపుతున్నవారికి ఊహించని ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ప్రియమైన వారి నుంచి మంచి విషయాలను వినే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. వైవాహిక జీవితం గడుపుతున్నవారికి ఈ వారం లాభదాయకంగా ఉండబోతోంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆర్థికంగా కూడా మంచి లాభాలు పొందుతారు. అయితే ఈ వారం మీరు వినాయకుడిని దర్శించడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. 


వృషభ రాశి:
వృషభ రాశివారికి కూడా ఈ వారం కలిసి రాబోతోంది. ఈ వారం మొత్తం వీరు ఎంతో సంతోషంతో పాటు ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా వీరి ఆనందాన్ని ఇంకో నలుగురితో పంచుకుని వారికి కూడా ఆనందం కలిగిస్తారు. వైవాహిక జీవితంలో ప్రేమ రెట్టింపు అవుతుంది..దీని కారణంగా మీ భాగస్వామితో ఎంతో ప్రేమగా ఉంటారు. అయితే ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో పని పెరగడం కారణంగా ఒత్తిడి, ఇతర చిన్న చిన్న మానసిక సమస్యలు రావచ్చు. ఇక వ్యాపారాలు చేసేవారి విషయానికొస్తే ఈ వారం అనేక రకాల లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కొంతమంది ఈ సమయంలో విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా దూరంగా ప్రయాణిస్తారు. ఈ సమయంలో మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. 


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్


మిథున రాశి:
మిథున రాశివారికి ఈ వారం సుఖం లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు మీ ఆర్థిక వ్యవరహాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా ఆదాయం పొందుతారు. ఆయితే ఈ వారం చిన్న చిన్న సమస్యల కారణంగా ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ వారం మొత్తం వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో చాలా కష్టపడాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో మీకు ఒత్తిడి పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల మద్ధతు లభించి ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వైవాహిక జీవితం గడిపే వారికి ఈ వారం సంతోషకరమైన రోజులుగా భావింవచ్చు. 


కర్కాటక రాశి:
ఈ వారం కర్కాటక రాశి వారికి కూడా చాలా అ మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం కష్టపడి పని చేయడం వల్ల ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ఉద్యోగాలు చేసేవారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ వారం వ్యాపారాలు చేసేవారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్‌లో మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ జీవితంలో శృంగారం పెరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి