Weekly Horoscope: ఈ వారం లాభాలతో పాటు నష్టాలు కూడా పొందబోతున్న రాశుల వారు వీరే..ఇందులో మీ రాశి కూడా ఉందా?
Weekly Horoscope 10-16 December 2023: ఈ వారం జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి కాబట్టి దీని కారణంగా ప్రత్యేక యోగం ఏర్పడి.. కొన్ని రాశుల వారిపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం కారణంగా వ్యక్తిగత జీవితంలో ఆశుభ, శుభ పరిణామాలు ఏర్పడతాయి.
Weekly Horoscope 10-16 December 2023: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాల కదలికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాలు నక్షత్రాలు రాశి సంచారం చేసినప్పుడు మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. గ్రహాలు వాటి గమనాన్ని మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి అశుభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కొన్ని గ్రహాలు రాశి సంచార దశలో ఉన్నాయి. కాబట్టి కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. ముఖ్యంగా ఈ వారం బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా 12 రాశుల్లోని కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందని.. మరికొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ యోగం కారణంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేష రాశి:
ఈ వారంలో ఏర్పడబోయే బుధాదిత్య రాజయోగం కారణంగా మేష రాశి వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభించి మనసులో సంతోషం పెరుగుతుంది తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు కలుగుతాయి శ్రమతో పాటు మంచి ఫలితాలు కూడా లభిస్తాయి అయితే ఆధునిక జీవనశైలి అనుసరించేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మితిమీరిన కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. సంభాషణ క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాలి.
వృషభ రాశి:
వృషభ రాశి వారు ఈ వారం ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కానీ కొన్ని సమస్యల కారణంగా మానసిక ఆందోళన పెరుగుతుంది. దీంతోపాటు ఇంతకుముందున్న కుటుంబ సమస్యలన్నీ మీకు ఇబ్బంది కలిగించే విధంగా మారవచ్చు. ఈ సమయంలో ఖర్చులు పెరుగుతాయి. అంతేకాకుండా మనసులో ప్రతికూలత శక్తి పెరిగే ఛాన్సులు కూడా ఉన్నాయి. అయితే వీరు ఈ వారం పాత స్నేహితులను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆహారయం పట్ల ప్రేమ పెరిగి వివిధ రకాలైన ఆహారాలను తింటారు. ఇక ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు అటెండ్ సులభంగా విజయాలు సాధిస్తారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
సింహరాశి:
ఈ వారం సింహ రాశి వారికి మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాకుండా నిర్మాణ సౌఖ్యం కూడా పెరుగుతుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లడమే కాకుండా దేవాలయాలను దర్శించుకునే అవకాశాలున్నాయి. అయితే చిన్న చిన్న సమస్యల వల్ల ఓపిక నశిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నిరాశ పెరిగి ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి కార్యాలయాల్లో అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి.
కన్యా రాశి:
కన్యా రాశి వారు ఈ వారం పూర్తి విశ్వాసంతో ఉంటారు. మీరు కోరుకున్న పనులు సులభంగా జరుగుతాయి అంతేకాకుండా ఆదాయం రెట్టింపవడం వల్ల పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కళా, సంగీతం పట్ల ఆసక్తి పెరిగి మంచి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగంలో మార్పులు వస్తాయి. ఇక ఆరోగ్య విషయంలో తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. ఆస్తులు కొనుగోలు చేయాలని వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో అతి ఉత్సాహం ప్రదర్శించడం మంచిది కాదు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి