Snake in Dream Meaning: హిందూమతంలో శివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగ. దేశవ్యాప్తంగా ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసం జాగరణలు చేస్తారు. శివయ్యకు అభిషేకం ఇష్టమైన పూలు, పండ్లు నైవేధ్యాలు పెడతారు. శివయ్యకు ఇష్టమైన నైవేధ్యాలు, పూలు మాత్రమే శివపూజలో ఉపయోగించాలి. దీనికి విరుద్దంగా చేస్తే శివుని ఆగ్రహం కలుగుతుంది. శివయ్యకు ఇష్టమైన నైవేధ్యాలు ఏంటో తెలుసుకుందాం.హిందూమతంలో శివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగ. దేశవ్యాప్తంగా ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరో నమ్మకం ప్రకారం ఈరోజు పాలసముద్రం నుంచి హాలాహలం బయటకు వస్తే లోకకల్యాణం కోసం శివుడి ఆ విషాన్ని సేవిస్తాడు. ఆరోజు నుంచి గుర్తుగా మహాశివరాత్రిని వేడుకగా జరుపుకొంటారు. శివుడికి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి ఫాల్గున మాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్ధశి తిథి రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది రేపు అంటే మార్చి 8 శుక్రవారం మహాశివరాత్రి జరుపుకొంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, మహాశివరాత్రికి ముందు మీకు  కలలో పాము కనిపించిందా? ఏం జరుగుతుందో తెలుసా? స్వప్న శాస్త్రం ప్రకారం మహాశివరాత్రికి ముందు కలలో రుద్రాక్షను చూడటం చాలా శుభప్రదం. ఇలాంటి కలలు మీకు వస్తే మీకు త్వరలో బాధలు, వ్యాధులు తొలగిపోతాయి. అంతేకాదు స్వప్నశాస్త్రం ప్రకారం కలలో రుద్రాక్ష కనిపిస్తే ఎన్నో రోజులుగా నిలిచిపోయిన మీ పనులు త్వరలో పూర్తవుతాయి. ఆ మహాశివుడి ఆశీర్వాదాలు మీపై ఉంటాయి. 


ఇదీ చదవండి: Mahashivaratri 2024: శివయ్యకు ఇష్టమైన నైవేధ్యాలు ఏంటో తెలుసా?


పాము.. 
మహాశివరాత్రికి ముందు పాము కల వస్తే మీకు సంపద, శ్రేయస్సుకు చిహ్నం. అలాగే బిల్వ పత్రం కలలోకి వస్తే మీరు ఆర్థిక ఇబ్బందులను అధిగమించబోతున్నారని అర్థం. 


లింగం.. మహాశివరాత్రికి ముందు కలలో శివలింగం కనిపిస్తే ఉద్యోగంలో శుభవార్త వింటారు. ఆర్థిక శ్రేయస్సు కలుగుతుందని అర్థం.


ఇదీ చదవండి: దక్షిణ భారతదేశంలోని 5 శివాలయాలు.. ఈ మహాశివరాత్రికి తప్పక సందర్శించండి..


ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ చేయడం వల్ల మనస్సు ఆహారానికి నీటికి దూరంగా ఉంటారు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈరోజు ఉదయం నిద్రలేచి స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకుంటారు. పూజగదిలో దీపం పెట్టి శివయ్యను పూజిస్తారు. అంతేకాదు దగ్గర్లో ఉన్న శైవాలయాలకు వెళ్లి జలాభిషేకం చేసి పంచామృతాన్ని శివయ్యకు సమర్పిస్తారు. పంచామృతంలో పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి ఉంటుంది. ఈ ఐదింటిని కలిపి అభిషేకం చేస్తారు. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter