Mahashivaratri 2024: శివయ్యకు ఇష్టమైన నైవేధ్యాలు ఏంటో తెలుసా?

Mahashivaratri 2024 Prsadam: హిందూమతంలో శివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగ. దేశవ్యాప్తంగా ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసం జాగరణలు చేస్తారు.

1 /5

హిందూమతంలో శివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగ. దేశవ్యాప్తంగా ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసం జాగరణలు చేస్తారు. శివయ్యకు అభిషేకం ఇష్టమైన పూలు, పండ్లు నైవేధ్యాలు పెడతారు. శివయ్యకు ఇష్టమైన నైవేధ్యాలు, పూలు మాత్రమే శివపూజలో ఉపయోగించాలి. దీనికి విరుద్దంగా చేస్తే శివుని ఆగ్రహం కలుగుతుంది. శివయ్యకు ఇష్టమైన నైవేధ్యాలు ఏంటో తెలుసుకుందాం.  

2 /5

పంచామృతం.. శివుడికి పంచామృతం ఎంతో ఇష్టం.సాధారణంగా శివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. పంచామృతం పాలు,పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఉపయోగించి తయారు చేస్తారు. పంచామృతం సంస్కృతం నుంచి వచ్చింది. 

3 /5

శ్రీఖండ్.. శ్రీఖండ్ ను పెరుగుతో తయారు చేస్తారు. ఇది క్రీమీ టెక్చర్ లో ఉంటుంఇ. ఇందులో వడకట్టిన గడ్డ పెరుగు, చక్కెర, యాలకులు, కుంకుమ పూవు ఇతర డ్రైఫ్రూట్స్ వేసి తయారు చేస్తారు. ఇది కూడా శివపూజలో నైవేధ్యంగా పెట్టవచ్చు.

4 /5

ఖిచిడీ.. ఖిచిడీ ఎంతో ఆరోగ్యకరమైన వంటకం. మహాశివరాత్రి రోజు ఖిడిడీని నైవేద్యంగా పెట్టవచ్చు. ఇది బియ్యం, పప్పులతో కలిపి తయారు చేస్తారు. సగ్గుబియ్యంతో కలిపి కూడా ఖచిడీ తయారు చేసుకుంటారు. మీకు కావాలంటే ఇందులో హెల్తీగా కూడా తయారు చేసుకోవచ్చు.

5 /5

పాయసం.. సాధారణంగా మనందరి ఇళ్లలో ఏ వేడుక, పండుగ జరుపుకున్నా పాయసం చేసుకుంటారు. సేమియా, గింజలు, నెయ్యి, చక్కెర వేసుకుని తయారు చేసుకోవచ్చు. ఇందులో ఆవుపాలు పోసి తయారు చేయాలి. ఎంతో రుచిగా ఉంటుంది. ఇది కూడా శివయ్యకు ఇష్టమైన నైవేధ్యం.