Magh Maas 2023: తెలుగు సంవత్సరంలోని పదకొండవ నెల మాఘమాసం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనది. హిందూ సంప్రదాయం ప్రకారం, మాఘమాసంలో నదీస్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించండి. దీంతో మీకు కోటి క్రతువులు చేసినంత ఫలితం లభిస్తుంది. మాఘమాసంలో నదీస్నానం చేస్తే మీ సర్వపాపాలు తొలగిపోతాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రస్తుతం పుష్యమాసం కొనసాగుతోంది. మాఘ మాసం 7 జనవరి 2023 నుండి ప్రారంభం కానుంది. ఈ మాసంలో శ్రీమహావిష్ణువును, సూర్యభగవానుని ఆరాధించడం వల్ల మీరు మరణానంతరం మోక్షాన్ని పొందుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాఘమాసంలో ఏం చేయాలి?
>> మాఘమాసంలో గంగాస్నానం తప్పక చేయాలి. ఈ మాసమంతా భగవద్గీత పఠించాలి. దీంతో మీరు శ్రీకృష్ణుని అనుగ్రహం పొందుతారు. 
>> ఈ మాసంలో ప్రతిరోజూ దీపం వెలిగించి తులసిని పూజించాలి. దీంతో ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాదు.
>> ఈ మాసంలో బట్టలు దానం చేయండి. దీంతో దేవతలు సంతోషిస్తారని ప్రతీతి.


మాఘమాసంలో ఏం చేయకూడదు?
>> మాఘమాసంలో ముల్లంగిని తినకూడదు. 
>> మాఘమాసంలో తామసిక ఆహారం తీసుకోకూడదు.
>> ఈ మాసంలో మద్యం మొదలైనవాటిని సేవించకూడదు.
>> మాఘమాసంలో అబద్ధాలు చెప్పకూడదు, ఎవరినీ అవమానించకూడదు.
>> మాఘమాసంలో రోజుకు ఒక్కసారే భోజనం చేయాలి. 


Also Read: Budh Gochar 2022: మకరరాశిలో బుధుడి సంచారం.. ఈ 4 రాశులకు ఆర్థికంగా లాభం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.