Shani Pradosha Vratam 2024: శనిప్రదోష వ్రతం ఎప్పుడు? ఈరోజు ప్రత్యేకతేంటో తెలుసా?
Shani Pradosha Vratam 2024: సాధారణంగా ప్రదోష వ్రతం సాయంత్రం సమయంలో చేసుకుంటారు. ఇది నెలలో ఒకసారి వస్తుంది. ఈరోజు శివుడిని పూజించడం ఆచారంగా వస్తుంది. అయితే, ప్రదోషవ్రతం ఈసారి అంటే ఏప్రిల్ 6 న శనివారం రానుంది.
Shani Pradosha Vratam 2024: సాధారణంగా ప్రదోష వ్రతం సాయంత్రం సమయంలో చేసుకుంటారు. ఇది నెలలో ఒకసారి వస్తుంది. ఈరోజు శివుడిని పూజించడం ఆచారంగా వస్తుంది. అయితే, ప్రదోషవ్రతం ఈసారి అంటే ఏప్రిల్ 6 న శనివారం రానుంది. దీన్నే శనిప్రదోష వ్రతం అంటారు. దీన్ని అత్యంత పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రెండు కలిసి రావడం అత్యంత విశేషమైన రోజు.
శనివారం ప్రదోష వ్రతం రెండు కలిసి వచ్చినప్పుడు శని ప్రదోష వ్రతం ఆచరిస్తారు ఇది చాలా పవిత్రమైన రోజు శని త్రయోదశి అనేది శనిదేవుడిని ఆరాధించడానికి ముఖ్యమైన రోజు ప్రదోషవతం రోజు శివుడిని పూజిస్తారు అయితే, శనివారం ప్రదోషవ్రతం వచ్చిన కారణంగా శని ప్రదోష వ్రతం ఈరోజు పూజిస్తే శివశనులు ఇద్దరూ పూజిస్తారు. దీంతో శని దోష బాధలనుంచి కూడా విముక్తి పొందుతారు.
సాధారణంగా శివభక్తుల జోలికి శనిదేవుడు రాడనే నమ్మకం ఉంది. శివుడిని పూజించేవారికి శని బాధలు ఉండవు. అందుకే శని వక్రదృష్టితో బాధపడేవారిని సైతం శివపూజ, రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ఈరోజు శివుడికి ఇష్టమైన నైవేద్యం, పూలు పండ్లు సమర్పించి అభిషేకం చేస్తారు. శనిదేవుడు శివుని ఆశీర్వాదంతో జన్మించాడు. అందుకే శనివక్ర దృష్టి శివభక్తులపై ఉండదు.
అలాగే ఆంజనేయుని పూజించినా శని బాధల నుంచి విముక్తి పొందుతారు. శనివారం ఆంజనేయుని గుడికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. దానానికి శనివారం ఎంతో ప్రత్యేకమైన రోజు.
ఇదీ చదవండి: సోమవతి అమావాస్య రోజు ఈ రెమిడీ చేస్తే శత్రువులు సైతం మోకరిల్లాల్సిందే..
శనివారం ఏప్రిల్ 6న రానుంది శని ప్రదోష వ్రతం రానుంది. శని ప్రదోష వ్రతం సాధారణంగా ప్రదోష వ్రతం సాయంత్రం సమయంలో చేస్తారు. ఈ ప్రదోష వ్రతం సూర్యాస్తమయానికి ఒక గంట ముందు ఆచరిస్తారు. శివుడికి ఇష్టమైన నైవేద్యలు పెడతారు. దగ్గర్లోని శివాలయాలకు వెళ్లి భక్తులు శివుడికి అభిషేకం చేస్తారు. ఈరోజు దానానికి కూడా ఎంతో ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది. శనివారం సాయంత్రం సమయంలో శివుడికి పాలు గంగాజలం సమర్పించే ఆచారం ఉంది.
ఇదీ చదవండి: ఏప్రిల్ నెలలో జన్మించిన వారు ఈ రత్నాన్ని ధరిస్తే.. ఇంట్లో డబ్బే డబ్బు!
ఈరోజు శివుడిని పూజిస్తే శని దోషం నుంచి కూడా విముక్తి పొందుతారు. శివుడికి పాలలో నల్ల నువ్వులు వేసి అభిషేకం చేయిస్తే అప్పుల నుంచి బయటపడతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి