Agni Chopra: చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ డైరెక్టర్ కొడుకు.. క్రికెట్ హిస్టరీలో ఒకే ఒక్కడు..
Ranji Trophy 2024: రంజీ క్రికెట్ లో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కొడుకు అరుదైన ఘనతను సాధించాడు. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కు సాధ్యం కాని రేర్ ఫీట్ ను సాధించాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరూ, అతని సాధించని ఘనతేంటో తెలుసా?
Agni Chopra Creates history: పొలిటిషియన్ కొడుకు పొలిటిషియన్ అవ్వడం, క్రికెటర్ కొడుకు క్రికెటర్ అవ్వడం, హీరో కొడుకు హీరో అవ్వడం.. మనం రోజూ చూస్తుంటాం. కానీ దానికి విరుద్దంగా ఓ ప్రముఖ డైరెక్టర్ కుమారుడు క్రికెటర్ గా అవతారం ఎత్తి రంజీల్లో ఇరగదీస్తున్నాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ ఏ క్రికెటర్ కు సాధ్యం కానీ రికార్డును సాధించారు. అతడే రీసెంట్ గా 12th ఫెయిల్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా(Vidhu Vinod Chopra) కుమారుడు అగ్ని చోప్రా. ఇతడు మిజోరాం తరుపున క్రికెట్ ఆడుతున్నాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తను(Agni Chopra) ఆడిన తొలి నాలుగు మ్యాచ్ ల్లో నాలుగు సెంచరీలు సాధించిన ఫస్ట్ క్రికెటర్ గా అగ్ని చోప్రా ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ ఏడాది రంజీల్లోకి అరంగ్రేటం చేసిన అగ్రి చోప్రా.. సిక్కింతో తన తొలి మ్యాచ్ ను ఆడాడు. ఈ గేమ్ లో తొలి ఇన్నింగ్స్ లో 166 పరుగులు చేసిన అగ్ని..రెండో ఇన్నింగ్ లో 92 పరుగులు చేశాడు. అనంతరం ఇతడు నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లపై కూడా సెంచరీలతో చెలరేగాడు.
తాజాగా మేఘాలయతో జరిగిన మ్యాచ్ లోనూ శతకాలతో కదం తొక్కాడు అగ్ని. మెుత్తానికి ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ సెంచరీలు చేసి సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రంజీ ట్రోఫీ-2024లో భాగంగా.. 4 మ్యాచ్లు ఆడిన చోప్రా 767 పరుగుల చేసి టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. కొడుకు సాధించిన ఘనతను చూసి డైరెక్టర్ విధు వినోద్ చోప్రా ఆనందంలో మునిగి తేలుతున్నాడు.
Also Read: ICC Test rankings: టెస్టుల్లో టాప్-10లో ముగ్గురు మనోళ్లే.. అశ్విన్‌కు అగ్రస్థానం..
Also Read: Jay Shah: ఐసీసీ ఛైర్మన్ పదవికి పోటీ చేయనున్న జై షా.. అందుకోసం ఏకంగా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి