Umran Malik: న్యూజిలాండ్‌పై నిప్పులు చెరిగిన ఉమ్రాన్ మాలిక్.. కశ్మీర్ ఎక్స్‌ప్రెస్‌పై ఆసక్తికర ట్వీట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
160 kph Delivery Coming Soon, SRH tweet about Umran Malik. న్యూజిలాండ్‌పై ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ స్పీడ్ చూసి ఐపీఎల్ ప్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆనందపడిపోతోంది.
Sunrisers Hyderabad tweet on Umran Malik: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఉమ్రాన్ మాలిక్ ఆడిన విషయం తెలిసిందే. టోర్నీ ఆసాంతం తన పేస్ బౌలింగ్‌తో ఉమ్రాన్ ప్రత్యర్థి బ్యాటర్‌లను బెంబేలెత్తించాడు. ఐపీఎల్ మొత్తం స్థిరంగా 150 కిమీ వేగంతో బంతులు వేశాడు. ఓ మ్యాచులో అయితే ఏకంగా 157 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సన్‌రైజర్స్ ఆడిన అన్ని మ్యాచులలో 'ఫాస్టెస్ట్ డెలివరీ'ని వేశాడు. దాంతో స్టార్ బ్యాటర్ల వద్ద కూడా ఉమ్రాన్ బంతులకు సమాధానం లేకపోయింది.
ఐపీఎల్ 2022లో 14 మ్యాచులు ఆడిన ఉమ్రాన్ మాలిక్.. 22 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన అతడికి ఏకంగా భారత జట్టలో చోటు దక్కింది. ఉమ్రాన్ భారత్ తరఫున 3 టీ20 మ్యాచులు ఆడాడు. ఇక ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఈరోజు (నవంబర్ 25) జరిగినను తొలి వన్డే ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ మాదిరిగానే అంతర్జాతీయ మ్యాచులలో కూడా ఉమ్రాన్ 150 కిమీ వేగంతో బంతులు సందించాడు. నేడు 153.1 కిమీ వేగంతో బంతిని సందించాడు. ఉమ్రాన్ తన మొదటి వన్డే బంతిని 145.9 కిమీ వేగంతో వేశాడు. ఈ మ్యాచులో అత్యధికంగా లాకీ ఫెర్గూసన్ 153.4 కిమీ వేగంతో బంతిని సందించాడు.
ఉమ్రాన్ మాలిక్ తొలి బంతి నుంచే నిప్పులు చెరుగుతూ న్యూజిలాండ్ బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో తన తొలి వికెట్ పడగొట్టాడు. డెవాన్ కాన్వేను (24) బోల్తా కొట్టించాడు. ఆపై 19 ఓవర్లో డారిల్ మిచెల్ (11)ను పెవిలియన్‌కు పంపి రెండో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచులో తన కోటా 10 ఓవర్లలో 66 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ పడగొట్టాడు. ప్రతి బంతిని దాదాపుగా 150 కిమీ వేగంతో సంధించిన ఉమ్రాన్‌పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ స్పీడ్ చూసి ఐపీఎల్ ప్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆనందపడిపోతోంది. తొలి వన్డే మ్యాచ్ జరుగుతుండగానే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. '160 కిమీ వేగం బంతి త్వరలోనే రానుంది.. సిద్ధంగా ఉండండి' అని పేర్కొంది. దీనికి రెండు ఎమోజిలను జతచేసి.. #NZvIND, #OrangeArmy హ్యాష్ టాగ్స్ ఇచ్చింది. ప్రస్తుతం వవ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2022లో భాగంగా మే 5న బ్రబౌర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 157 కిమీ వేగంతో ఉమ్రాన్ బంతిని సంధించాడు.
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ బంతిని సంధించిన భారత బౌలర్‌గా మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ ఉన్నాడు. 1997లో ఆస్ట్రేలియాపై గంటకు 149.6 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బంతిని శ్రీనాథ్ సంధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు వేగవంతమైన డెలివరీని సంధించింది పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. న్యూజిలాండ్‌పై అక్తర్ గంటకు 161 కిమీ వేగంతో బంతిని వేశాడు.
Also Read: Shreyas Iyer Record: శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు.. ఏ టీమిండియా క్రికెటర్‌కు సాధ్యం కాలేదు!
Also Read: ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా.. ఓపెన్ అయిన కృతి సనన్.. ఆదిపురుష్ ఎఫెక్టేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.