IND vs ZIM: మరో సిరీస్‌పై కన్నేసిన టీమిండియా..రేపే జింబాబ్వేతో రెండో వన్డే..!
IND vs ZIM: టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా మరో సిరీస్‌పై ఫోకస్ చేసింది. శనివారం జింబాబ్వేతో జరగబోయే రెండో వన్డేకు భారత్ సిద్ధమవుతోంది.
IND vs ZIM: భారత క్రికెట్ జట్టు మరో సిరీస్‌పై కన్నేసింది. రేపు(శనివారం) హరారే వేదికగా రెండో వన్డే జరగనుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12.45 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. మొదటి మ్యాచ్‌లో గెలిచి టీమిండియా బీ జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత జట్టు సమతూకంగా ఉంది. టీమిండియాను జింబాబ్వే ఓడించడం అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు.
రెండో మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా భారత్ బరిలో దిగే అవకాశం ఉంది. తొలి వన్డేలో శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ ఇద్దరే మ్యాచ్‌ను గెలిపించారు. ఇతరులకు అవకాశం దక్కలేదు. బౌలింగ్‌లో చాహర్, అక్షర్ పటేల్ అదరగొట్టారు. తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించే పరిస్థితులు ఉన్నాయి. ఇటు జింబాబ్వే సైతం పుంజుకోవాలని భావిస్తోంది. రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని వ్యూహాలు రచిస్తోంది.
తొలి వన్డేలో జింబాబ్వే అన్ని విభాగాల్లో విఫలమైంది. బ్యాటింగ్‌లో కేవలం ముగ్గురు మాత్రమే 30కి పైగా పరుగులు చేశారు. మిగతా వారంతా ఘోరంగా విఫలమయ్యారు. ఇటు బౌలింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయారు. భారత ఓపెనర్లే మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. రెండో వన్డేలో జింబాబ్వే మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో మార్పులు ఉంటాయని ఆ జట్టు వర్గాలు చెబుతున్నాయి.
మొత్తంగా ఈసిరీస్ ఏకపక్షంగా ఉంటుందని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. 3-0తో సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న టీమిండియాను జింబాబ్వే అడ్డుకట్ట వేయలేదని స్పష్టం చేస్తున్నారు.
భారత జట్టు..
శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహల్(కెప్టెన్), దీపక్ హుడా, సంజూ శాంసన్(కీపర్), అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.
జింబాబ్వే జట్టు..
కియా, మరుమణి, మధెవెరె, విలియమ్స్, రజా, ఛకబ్వా, బుర్ల్, జాన్‌గ్వే, ఈవన్స్, నగరవ, న్యాచిక్
Also read:Munugode Bypoll: మునుగోడు బీజేపీలో ముసలం.. ఈటల రాజేందర్ పై గొంగిడి టీమ్ ఆగ్రహం
Also read:China: చైనాలో సెగలు పుట్టిస్తోన్న హీట్ వేవ్..మేఘమథనం షూరు చేసిన ప్రభుత్వం..!
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook