Team India: టీ20 ప్రపంచకప్ 2022 కోసం ఆ అభిమాని ఎంపిక చేసిన టీమ్ ఇండియా జట్టు ఇదే
Team India: ఐపీఎల్ 2022 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ 2022 సందడి ప్రారంభం కానుంది. ఈసారి టీమ్ ఇండియాను బీసీసీఐ కాదు..అభిమానులే సెలెక్ట్ చేసేశారు. ఆశ్చర్యంంగా ఉందా..అదేదో చూడండి..
Team India: ఐపీఎల్ 2022 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ 2022 సందడి ప్రారంభం కానుంది. ఈసారి టీమ్ ఇండియాను బీసీసీఐ కాదు..అభిమానులే సెలెక్ట్ చేసేశారు. ఆశ్చర్యంంగా ఉందా..అదేదో చూడండి..
ఐపీఎల్ 2022 పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ నెల 29వ తేదీతో ఐపీఎల్ 2022 ముగియనుంది. ఆ తరువాత టీ20 ప్రపంచకప్ 2022 సందడి ప్రారంభం కానుంది. ఈసారి మాత్రం టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ సెలెక్టర్లు కాకుండా..అభిమానులే ఎంపిక చేస్తున్నారు. అవును నిజమే..అదే జరిగింది.
ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరుగుతుండగా..ఓ క్రికెట్ అభిమాని ప్రదర్శించిన ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలా బాగా తిరుగుతోంది. స్డేడియంలో కెమేరాన్నీ ఆ పోస్టర్‌వైపే దృష్టి సారించాయి. ఆ పోస్టర్‌లో ఉన్న కంటెంట్ అందర్నీ ఆకర్షిస్తోంది. అందుకే ఆ పోస్టర్ అంతగా స్ప్రెడ్ అవుతోంది. ఇంతకీ ఆ పోస్టర్ ద్వారా ఆ అభిమాని టీ20 ప్రపంచకప్ 2022 కోసం టీమ్ ఇండియా టాప్ 15 ప్రొబెబుల్స్ ఆటగాళ్లను జాబితా ప్రదర్శించాడు. ఈ టీమ్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ కాదు సుమా. ఆ వ్యక్తి స్వయంగా ఎంపిక చేశాడు.
టీ20 ప్రపంచకప్ 2022 జాబితా ఇదే
ఆ వ్యక్తి ప్రదర్శించిన పోస్టర్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, ఆర్ అశ్విన్, యజువేంద్ర చహల్, దీపక్ చాహర్, మొహమ్మద్ షమి, జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, రాహుల్ తెవాటియా, రిషభ్ పంత్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు.
టీ20 ప్రపంచకప్ 2022 ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియా గడ్డపై ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌కు 5 నెలల ముందే ఆ అభిమాని జట్టును సెలెక్ట్ చేశాడు. టీ20 ప్రపంచకప్ 2022లో అక్టోబర్ 23న టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. మెల్‌బోర్న్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఇండియా-పాకిస్తాన్ మధ్య జరగనుంది. గత ఏడాది 2021లో యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తొలిసారి ఇండియాను ఓడించింది. టీమ్ ఇండియా సెమీఫైనల్స్ కంటే ముందే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు టీమ్ ఇండియాకు పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం లభిస్తోంది.
Also read: IPL Ravindra Jadeja: చెన్నై మేనేజ్‌మెంట్‌తో విభేదాలు...? జడేజా ఐపీఎల్‌కి దూరమవడానికి అదే కారణమా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook