IPL Rifts between CSK and Jadeja: తాజా ఐపీఎల్ సీజన్ చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజాకు ఏమాత్రం కలిసిరాలేదనే చెప్పాలి. ఈ సీజన్‌లో అనూహ్యంగా చెన్నై పగ్గాలు అందుకున్న జడేజా... జట్టు సారథిగా ఘోరంగా విఫలమయ్యాడు. జడేజా కెప్టెన్‌గా వ్యవహరించిన 8 మ్యాచ్‌ల్లో ఆరింట చెన్నై ఓటమిని మూటగట్టుకుంది. ఇదే క్రమంలో కెప్టెన్సీ పగ్గాలు వదులుకున్న జడేజా... ఈ నెల 4న బెంగళూరుతో మ్యాచ్‌లో గాయపడ్డాడు. పక్కటెముకకు బలమైన గాయమవడంతో ఐపీఎల్ టోర్నీ నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. జడేజా ఇక ఈ ఐపీఎల్‌కు సీజన్‌లో ఆడట్లేదంటూ చెన్నై జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. అయితే జడేజా ఐపీఎల్‌కు దూరమవడానికి గాయమే కారణమా... లేక చెన్నై మేనేజ్‌మెంట్‌తో విభేదాలే అసలు కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
చెన్నై మేనేజ్‌మెంట్‌తో విభేదాలు...? :
చెన్నై జట్టు మేనేజ్‌మెంట్‌తో ఉన్న విభేదాలే జడేజాను ఐపీఎల్‌కు దూరం చేశాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సీఎస్‌కే క్యాంప్ ఇన్‌సైడ్ రిపోర్ట్ ప్రకారం... జడేజా కెప్టెన్సీ వదులుకున్నప్పటి నుంచి జట్టు మేనేజ్‌మెంట్‌కు అతనికి మధ్య పరిస్థితులు సరిగా లేవని అంటున్నారు. దీంతో జడేజా నిరాశకు గురయ్యాడని... అందుకే టోర్నీకి దూరమై ఉండొచ్చునని అంటున్నారు.
జడేజాను అన్‌ఫాలో చేసిన సీఎస్‌కే :
ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్‌కే అధికారిక హ్యాండిల్ రవీంద్ర జడేజా ఇన్‌స్టాను అన్‌ఫాలో చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జడేజా, సీఎస్‌కే మేనేజ్‌మెంట్ మధ్య విభేదాలు నిజమేనని అంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ తోసిపుచ్చారు. గాయంతోనే జడేజా ఐపీఎల్‌కు దూరమయ్యాడు తప్ప మరేమీ లేదన్నారు. దురదృష్టవశాత్తు అతను గాయపడటం వల్ల ఆటకు దూరమవాల్సి వచ్చిందన్నారు.
సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు చేరుతుందా..?
తాజా ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడిన చెన్నై జట్టు కేవలం నాలుగింట విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. చెన్నై ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగతా 3 మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంటుంది. ఇవాళ చెన్నై జట్టు ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Also Read: Shocking News: ఒక్క పొటాటో చిప్ పీస్‌కు ఏకంగా రూ.1.63 లక్షలు.. ఎందుకింత ధరో తెలుసా..?
Also Read: Where Is Cm Kcr: సీఎం కేసీఆర్ ఎక్కడ..! ఫాంహౌజ్ లో ఏం చేస్తున్నారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook