WTC Final 2023 India Playing XI: ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ వేదికగా జూన్‌ 7న ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్లో ఫైనల్లో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు బలంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 నేపథ్యంలో మాజీలు అందరూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్పందించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం భారత భారత తుది జట్టును ఫించ్‌ ఎంపిక చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోన్ ఫించ్ తన జట్టుకు ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌లను ఎంచుకున్నాడు. మూడో స్థానంలో ఛతేశ్వర్‌ పుజారాను ఎంచుకోగా..  నాలుగో స్థానంలో విరాట్‌ కోహ్లీని ఎంపిక చేశాడు. ఐదవ స్థానంలో అజింక్య రహానేను తీసుకున్న ఫించ్.. వికెట్ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌కు అవకాశం ఇచ్చాడు. ఫించ్‌ తన జట్టులో కీపర్‌గా తెలుగు ఆటగాడు కేఎస్‌ భరత్‌ను కాకుండా కిషన్‌ను ఎంపిక చేయడం గమనార్హం. ఐపీఎల్ 2023లో ఇషాన్ బాగా ఆడిన విషయం తెలిసిందే. 


ఆరోన్ ఫించ్ తన జట్టులో ఇద్దరు స్పినర్లకు చోటిచ్చాడు. స్పిన్ కోటాలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ఫించ్ ఎంపిక చేశాడు. ఇంగ్లీష్ పి‌‌‌‌చ్‌లు కాబట్టి ఇద్దరు స్పిన్నర్లకు చోటివ్వడం కాస్త ఆలోచించాల్సిన విషయం. ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగంలో మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీ, శార్థూల్‌ ఠాకూర్‌లకు ఫించ్‌ చోటిచ్చాడు. సీనియర్ పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌కు ఫించ్ జట్టులో చోటు దక్కలేదు.


ఫించ్ ఎంపిక చేసిన భారత తుది జట్టు: 
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. 


Also Read: Hero HF Deluxe 2023: హీరో సరికొత్త 100సీసీ బైక్.. ధర 60 వేలు మాత్రమే! సూపర్ మైలేజ్  


Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. మ్యాచ్ డ్రా అయితే ట్రోఫీ ఏ జట్టుదో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK.