IPL 2020 Updates: ఐపీఎల్ 13వ ( IPL 13 Season ) సీజన్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది అని తెలియగానే క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కరోనావైరస్ ( Coronavirus ) కష్టాల మధ్య క్రికెట్ చూసి సేదతీరొచ్చు అనుకున్నారు. అయితే ఐపీఎల్ 2020 ( IPL 2020 ) గతంలో జరిగిన సీజన్స్ కన్నా ఎంతో భిన్నంగా ఉండ నుంది. ఐపీఎల్ 2020 ని యూఏఈలోని షార్జా, అబుదాబి, దుబాయ్ ఇలా విభిన్న వేదికల్లో నిర్వహించనున్నారు. ( థ్రిల్లింగ్ కలిగించే అప్సరా రాణి హాట్ ఫోటోలు  )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అయితే ప్రస్తుతం కరోనావైరస్ సంక్రమణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్యపరమైన ఆంక్షల మధ్య ఎన్నో మార్పులు జరగనున్నాయి. ఇందులో ముఖ్యంగా ఆటగాళ్ల రవాణా, లాజిక్టిక్స్ వంటి కీలక అంశాల వల్ల కొంత మంది ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premier League ) ఐపీఎల్ 2020 నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాలు ఇప్పటికే ఐపీఎల్ ఆటగాళ్లకు అనుమతిచ్చాయి. అయితే సౌత్ ఆఫ్రికా టీమ్ మాత్రం ఈ సీజన్ ఆడుతుందా లేదా అనే  సందేహం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఆ దేశం ఆటగాళ్లు తమ లాజిక్టిక్స్, రవాణా ఏర్పాట్లు సొంతంగా చేసుకోవాలట. దీంతో సౌత్ ఆఫ్రికాకు చెందిన డివిలియర్స్ ( AB De Villiers ), క్వింటన్ డికాక్ ఈ సారి ఐపీఎల్ ఆటడం కష్టమే అనిపిస్తోంది. ( Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు )