Rashid Khan: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకోవడంతో..వారికి భయపడి వేలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. కాగా అఫ్గాన్ లో నెలకొన్న పరిస్థితులపై ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్(Kevin Peterson) వెల్లడించాడు. రషీద్ తన కుటుంబాన్ని తరలించలేక కుమిలిపోతున్నట్లు పీటర్సన్ పేర్కొన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం రషీద్‌ ఖాన్‌(Rashid Khan) ఇంగ్లండ్‌ వేదికగా హండ్రెడ్‌ టోర్నీలో ట్రెంట్‌ రాకెట్స్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పీటర్సన్‌ స్పందించాడు. ‘అఫ్గానిస్థాన్‌(Afghanistan)లో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయమై రషీద్‌తో చాలాసేపు చర్చించా. అతడు చాలా బాధపడుతున్నాడు. తన కుటుంబాన్ని అఫ్గాన్‌ నుంచి తరలించలేకపోయాడు. ఈ విషయమై అతడు కుమిలిపోతున్నాడు’ అని పీటర్సన్‌ వెల్లడించాడు.  ఈ ఒత్తిడి నుంచి రషీద్‌ తొందరగా బయటపడాలని పీటర్సన్(Kevin Peterson) ఆశాభావం వ్యక్తం చేశాడు.


Also Read:ప్రపంచ నేతలారా! 'మా దేశాన్ని ఈ గందరగోళం నుంచి కాపాడండి': రషీద్ ఖాన్


అఫ్గానిస్థాన్‌(Afghanistan)లో శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ నేతలు చొరవ తీసుకోవాలని ఈమధ్యే రషీద్‌ ఖాన్‌(Rashid Khan) ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు. మరోవైపు తాలిబన్ల(Taliban)కు క్రికెట్‌ అంటే ఇష్టమని.. వారు మద్దతిస్తారని.. మా కార్యకలపాలకు అడ్డుపడరని అఫ్గన్‌ క్రికెట్‌ సీఈవో హమీద్‌ షీన్వారీ మంగళవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook