Alex Carey became the first wicketkeeper to take 8 catches on Test debut: ఆస్ట్రేలియా కొత్త టెస్టు వికెట్‌ కీపర్‌ ఆలెక్స్‌ కేరీ (Alex Carey) అరంగేట్ర టెస్టులోనే చరిత్ర సృష్టించాడు. అరంగేట్ర టెస్టు (Test debut)లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి యాషెస్ టెస్టులో (రెండు ఇన్నింగ్స్) కేరీ 8 క్యాచులు అందుకున్నాడు. దాంతో ఆసీస్ వికెట్‌ కీపర్‌కు చిరస్మరణీయమైన టెస్టుగా మారింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ 2021-22కు (Ashes 2021) ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ తప్పుకోవడంతో కేరీ అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పైన్‌ తప్పుకోవడంతో.. జట్టు పగ్గాలు పాట్ కమిన్స్ అందుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రిస్బేన్‌ టెస్టులో 8 క్యాచులు అందుకోవడంతో టీమిండియా వికెట్ కీపర్‌ రిషబ్ పంత్‌ (Rishabh Pant) రికార్డును ఆలెక్స్‌ కేరీ బద్దలుకొట్టాడు. ఇంతకుముందు అరంగేట్ర టెస్టులో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు పంత్ (7) పేరిట ఉండగా.. తాజాగా ఆ రికార్డును కేరీ అధిగమించాడు. దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ శ్రీలంకతో జరిగిన ఓ టెస్టులో మొత్తం 9 క్యాచ్‌లు అందుకోగా.. అది అతడి అరంగేట్రం కాకపోవడం విశేషం. అంతకుముందే డికాక్‌ ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేయగా.. ఆ మ్యాచ్‌లో డివిలియర్స్‌ (ABD) కీపర్‌ బాధ్యతలు చేపట్టాడు. అరంగేట్ర మ్యాచులో డికాక్‌ కీపింగ్ చేయలేదు. 


Also Read: Virat Kohli: పాపం విరాట్ కోహ్లీ.. 2021 ఏమాత్రం కలిసిరాలేదుగా! ఆ ఒక్క సంతోషం తప్ప.. అన్ని పాయే!!


అరంగేట్ర టెస్టులో రిషబ్ పంత్‌ (Rishabh Pant) సహా మరో ఐదుగురు ఏడు క్యాచ్‌లు అందుకున్నారు. క్రిస్‌ రీడ్‌ (ఇంగ్లండ్), బ్రియన్‌ టేబర్‌ (ఆస్ట్రేలియా), చమర దుసింగె (శ్రీలంక), పీటర్‌ నెవిల్‌ (ఆస్ట్రేలియా), అలన్‌ నాట్‌ (ఇంగ్లండ్)లు అరంగేట్ర టెస్టులో ఏడు క్యాచ్‌లు అందుకున్నారు. ఆలెక్స్‌ కేరీ ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్ట్, 45 వన్డేలు, 38 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 21, వన్డేల్లో 1203, టీ20లలో 233 రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. 


Also Read: Mouni Roy Photos: అర్ధ నగ్న ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న మౌనీ రాయ్- బీచ్ లో బికినీతో..


బ్రిస్బేన్‌ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలన్‌ను ఔట్ చేయడం ద్వారా ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ (Nathan Lyon) టెస్టుల్లో 400 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు. దీంతో ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్లో 400లకు పైగా వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆసీస్ మాజీ ఆటగాళ్లు షేన్‌ వార్న్‌ (708 వికెట్లు), గ్లెన్‌ మెక్‌ గ్రాత్‌ (563 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక టెస్టుల్లో 400 వికెట్లు తీసిన జాబితాలో లియ‌న్ 17వ బౌల‌ర్‌ కావ‌డం విశేషం. ఆస్ట్రేలియా త‌ర‌పున లైయన్ 101వ‌ టెస్టు ఆడాడు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook