Alzarri Joseph Vs Shai Hope: క్రికెట్‌ చరిత్రలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ కెప్టెన్ షైయ్‌ హోప్‌పై కోపంతో మైదానం నుంచి డగౌట్‌కు వెళ్లి కూర్చుకున్నాడు. తన చెప్పినట్లు కెప్టెన్‌ ఫీల్డింగ్ సెట్ చేయలేదని అలిగిన అల్జారీ జోసెఫ్.. వికెట్ తీసి ఓ ఓవర్ పాటు ఫీల్డ్‌కు దూరంగా కూర్చిండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా.. వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో వన్డే బార్బడోస్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ ఆరంభించింది. తొమ్మిది పరుగులకే ఇంగ్లాండ్ ఒక వికెట్ కోల్పోగా.. నాలుగో ఓవర్‌ వేసేందుకు జోసెఫ్‌కు కెప్టెన్ షైయ్‌ హోప్ బంతిని అందించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Civils Mains: నిరుద్యోగులకు జాక్ పాట్.. ఒక పరీక్ష పాసయితే రూ.లక్ష డబ్బులు మీకే


బౌలింగ్ వేసేందుకు వచ్చిన జోసెఫ్‌.. ఫీల్డింగ్ సెట్టింగ్ గురించి కెప్టెన్‌కు సలహాలు ఇచ్చాడు. అయితే అతను చెప్పినట్లు హోప్ వినకుండా.. తనకు నచ్చినట్లు ఫీల్డింగ్ సెట్ చేశాడు. హోప్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన జోసెఫ్‌.. ఓ బంతి వేసిన తరువాత మరోసారి ఫీల్డింగ్ మార్చమని అడిగాడు. కానీ హోప్ పట్టించుకోకుండా వికెట్ కీపింగ్‌కు వెళ్లిపోయాడు. దీంతో కోపంతో జోసెఫ్‌ బంతిని 148.2 కి.మీ. వేగంలో బౌలింగ్ చేశాడు. షార్ట్ బంతి బ్యాట్స్‌మెన్ జోర్డాన్ కాక్స్‌ బ్లౌజ్‌ను తాకి కీపర్ హోప్ చేతుల్లో పడింది. 


వికెట్ దక్కినా జోసెఫ్‌ కోపం మాత్రం తగ్గలేదు. అదే ఆగ్రహంలో మిగిలిన రెండు బంతులు వేసి ఓవర్ ముగిసిన తరువాత ఎవరితో మాట్లాడకుండా ఫీల్డ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. గమనించిన కోచ్ డారెన్ సామీ.. జోసెఫ్‌ను వెళ్లొద్దని సైగలు చేశాడు. అయినా వినకుండా లోపలకు వెళ్లి కూర్చుకున్నాడు. దీంతో ఓ ఓవర్‌పాటు పది మంది ఫీల్డర్లే ఫీల్డింగ్ చేశారు. తరువాత జోసఫ్‌తో డారెన్ సామీ మాట్లాడడంతో శాంతించాడు. తరువాత మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే కెప్టెన్‌పై గౌరవం లేకుండా మైదానం నుంచి వెళ్లిపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 


ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 43 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. బ్రాండన్ కింగ్ (102), కార్టీ (128) సెంచరీలతో చెలరేగారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది.


Also Read: Civils Mains: నిరుద్యోగులకు జాక్ పాట్.. ఒక పరీక్ష పాసయితే రూ.లక్ష డబ్బులు మీకే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.