Anil Kumble wants Team India to have different teams: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు ఉన్న విషయం తెలిసిందే. క్రికెట్‌లో టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లు ఉన్నాయి. గత కొంతకాలంగా కొన్ని టీమ్స్ మూడు ఫార్మాట్లకు వేర్వేరుగా జట్లను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇప్పటికే టీ20, టెస్టులకు వేర్వేరు జట్లను తయారు చేసుకొన్నాయి. దాంతో మెగా టోర్నీలతో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్నాయి. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ 2022ను కూడా ఇంగ్లీష్ జట్టు ఇదే ఫార్ములాతో గెలుచుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్‌ 2022లో భారత్ సెమీస్ నుంచి ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌పై దారుణ ఓటమిని ఎదుర్కొన్న టీమిండియాపై విమర్శల వర్షం కురుస్తోంది. సరైన బ్యాటింగ్, బౌలింగ్ లేక మెగా టోర్నీ నుంచి భారత్ బయటికి వచ్చింది. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న చాలా మంది ప్లేయర్స్ మూడు ఫార్మాట్లలో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ కమ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పందించారు. భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు, టెస్టు ఫార్మాట్‌కు వేర్వేరుగా జట్లను సిద్ధం చేసుకోవాలని.. కోచ్‌లను కూడా మార్చాలని సూచించారు. 


వెస్టిండీస్ మరియు యుఎస్‌ఎ ఆతిథ్యం ఇవ్వనున్న 2024 టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఏమి మెరుగుపరుచుకోవాలనే విషయాలపై అనిల్ కుంబ్లే మాట్లాడాడు. 'భారత్ తప్పకుండా ప్రతి ఫార్మాట్‌కు ప్రత్యేక జట్టును తయారుచేసుకోవాలి. అలాగే వేర్వేరు కోచ్‌లను కూడా నియమిస్తే బాగుంటుంది. టీ20 స్పెషలిస్ట్‌లు ఉంటేనే ఉత్తమం. ఇదే పద్దతిని ఇంగ్లండ్ కార్యరూపంలోకి తీసుకొచ్చింది. ఆస్ట్రేలియా కూడా ప్రత్యేకంగా జట్లను తయారు చేసుకొంది. భారత్ కూడా ఇదే పద్దతిని అమల్లోకి తీసుకురావాలి' అని కుంబ్లే చెప్పాడు. 


'భారత జట్టు పెద్ద సంఖ్యలో ఆల్‌రౌండర్లను అన్వేషించాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌పైనా దృష్టిసారించాలి. టీ20 ప్రపంచకప్‌ 2022లో పాకిస్తాన్‌పై మ్యాచ్‌నే ఓసారి చూస్తే.. లియామ్‌ లివింగ్‌స్టోన్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. లియామ్‌ వంటి నాణ్యమైన ప్లేయర్ ఏ ఇతర జట్టుకూ లోయర్‌ఆర్డర్‌లో ఆడేందుకు లేడు. ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్‌ కూడా ఆరో స్థానంలో బరిలోకి దిగాడు. ఇలాంటి జట్టును తయారు చేసుకోవాల్సిన అవసరం టీమిండియాకు ఎంతో ఉంది. దాని కోసం మేనేజ్మెంట్ ఏం చేయాలనేది త్వరగా ఆలోచించాలి' అని అనిల్ కుంబ్లే అన్నాడు.


Also Read: కేకేఆర్‌కు భారీ షాక్‌.. ఐపీఎల్ 2023 నుంచి తప్పుకున్న హార్డ్‌ హిట్టర్‌! సాయంత్రం 5 గంటల వరకు గడువు 


Also Read: చిరుతను లాలించేందుకు దగ్గరకు వెళ్లిన చిన్నారి.. ఎంతగుండె ధైర్యం బాలికా నీకు! చివరకు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి