Virat Kohli-Anushka Sharma: నిన్ను పిచ్చిగా ప్రేమిస్తూనే ఉంటా.. విరాట్ కోహ్లీ ట్వీట్ వైరల్!
Virat Kohli shares his wife Anushka Sharma hot pictures on her Birthday. నేడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పుట్టిన రోజు.
Virat Kohli shares his wife Anushka Sharma hot pictures on her Birthday: నేడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పుట్టిన రోజు. సోమవారం (మే 1)తో అనుష్క 35వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కోహ్లీ తన సతీమణి అందమైన ఫొటోస్ పోస్ట్ చేసి.. ఎమోషనల్ నోట్ రాశాడు. నిన్ను పిచ్చిగా ప్రేమిస్తూనే ఉంటా అని విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం అనుష్క ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో అనుష్కకి నెట్టింట బర్త్ డే విషెష్ (Anushka Sharma BirthDay) వెల్లువెత్తుతున్నాయి.
'కష్టాలు, సుఖాలు, నీ క్యూట్ పిచ్చినతనం.. అన్నింటిలో నిన్ను పిచ్చిగా ప్రేమిస్తూనే ఉంటా. నా సర్వస్వం అయిన అనుష్క శర్మకు హ్యాపీ బర్త్ డే' అని విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. అంతేకాదు మూడు లవ్ సింబల్స్ కూడా జతచేశాడు. ఇప్పటివరకు పోస్ట్ చేయని కొన్ని అనుష్క ఫొటోలను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు 2017 డిసెంబరులో ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
'రబ్ నే బనాదీ జోడీ' సినిమాతో అనుష్క శర్మ తెరంగేట్రం చేశారు. 2013లో ఓ కమర్షియల్ యాడ్ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. దాదాపుగా నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట ఇరు కుటుంబాల అనుమతితో 2017లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. ఈ జంటకు 2021 జనవరిలో కూతురు వామిక జన్మించింది. పెళ్లి అనంతరం అనుష్క పూర్తిగా సినిమాలు మానేశారు. కోహ్లీ ఆడే ప్రతి మ్యాచుకు వచ్చి వచ్చి అతడిని ఉత్సాహపరుస్తుంటారు. కోహ్లీ కూడా వీలు చిక్కినప్పుడల్లా విహారయాత్రలకు అనుష్కను తీసుకువెళ్తూ ఉంటాడు.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ 2023తో బిజీ బిజీగా ఉన్నాడు. ఫాఫ్ డుప్లెసిస్ గాయం బారిన పడడంతో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మరోవైపు బ్యాటర్‌గానూ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 333 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 82 నాటౌట్. అనుష్క కూడా మైదానంకు వచ్చి ఐపీఎల్ మ్యాచులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక బెంగళూరు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలిచి 8 పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. నేడు బెంగళూరు మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉంది.
Also Read: Asia Cup 2023: ఆసియా కప్ 2023 నుంచి పాకిస్థాన్ ఔట్.. ఐదు దేశాలతో టోర్నీ ప్లాన్ చేసిన బీసీసీఐ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.