Asia Cup 2023: ఆసియా కప్ 2023 నుంచి పాకిస్థాన్ ఔట్.. ఐదు దేశాలతో టోర్నీ ప్లాన్ చేసిన బీసీసీఐ!

Asia Cup 2023 To Be Cancelled after BCCI plans 5 Nation Tournament. ఆసియా కప్‌ 2023ని నిర్వహించాలనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రణాళికలు ప్రమాదంలో ఉన్నాయని సమాచారం తెలుస్తోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : May 1, 2023, 04:19 PM IST
Asia Cup 2023: ఆసియా కప్ 2023 నుంచి పాకిస్థాన్ ఔట్.. ఐదు దేశాలతో టోర్నీ ప్లాన్ చేసిన బీసీసీఐ!

BCCI Plans 5 Nation Tournament in place of Asia Cup 2023: ఆసియా కప్‌ 2023 నిర్వహణ అంశం ప్రస్తుతం పెద్ద చర్చగా మారిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌ నిర్వహణ హక్కులు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) వద్ద ఉన్న నేపథ్యంలో.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత క్రికెటర్లను పాకిస్థాన్‌కు పంపే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ జై షా ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ కూడా భారత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు. దాంతో బీసీసీఐ, పీసీబీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. 

ఆసియా కప్‌ 2023ని నిర్వహించాలనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రణాళికలు ప్రమాదంలో (PCB to sacrifice Asia Cup) ఉన్నాయని సమాచారం తెలుస్తోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ మరియు పీసీబీ మధ్య ఉన్న విబేధాల కారణంగా.. సెప్టెంబరులో పాకిస్తాన్‌లో జరగనున్న ఆసియా కప్‌ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని పాకిస్తాన్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఆసియా కప్‌ 2023 నుంచి తప్పుకునేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇందుకు కారణం బీసీసీఐ అట. ఇక ఆసియా కప్‌ 2023ని రద్దు చేసి దాని స్థానంలో ఐదు దేశాలు మాత్రమే పాల్గొనే మరో టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోందట. 

ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) టోర్నీ సజావుగా సాగాలంటే.. భారత్ ఆడే కొన్ని మ్యాచ్‌లు తటస్థ వేదికపై నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ హైబ్రీడ్‌ మోడల్‌కు పీసీబీ సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. హైబ్రీడ్‌ మోడల్‌ ప్రతిపాదనకు ముందుగా ఓకే చెప్పిన బీసీసీఐ కార్యదర్శి జై షా.. తాజాగా తిరస్కరించినట్లు సమాచారం. టోర్నీ వేదికను పాకిస్తాన్ నుంచి వేరే దేశానికి తరలించాలని చెప్పినట్లు సమాచారం. అయితే హైబ్రిడ్ మోడల్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వని పీసీబీ.. టోర్నీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉందట. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కాకపోతే చాంపియన్స్‌ ట్రోఫీ 2025 నిర్వహణలోనూ సమస్యలు తలెత్తుతాయని పీసీబీ భావిస్తోందట.

పీసీబీ, బీసీసీఐ మధ్య గొడవల కారణంగా ఈ సంవత్సరం ఆసియా కప్ జరగకపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆసియా కప్ చుట్టూ ఉన్న సందిగ్ధత కారణంగా భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఈ ఆఫ్-ఫీల్డ్ మ్యాచ్‌లో చివరికి ఏమి జరుగుతుందదో చూడాలి. ఇక ఆసియా కప్‌ 2023 నిర్వహణపై పాకిస్తాన్ సమస్యలు సృష్టిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఓ ప్లాన్‌ సిద్ధం చేసిందట. ఆసియా కప్‌ను రద్దు (Asia Cup 2023 Cancelled) చేసి ఆ స్థానంలో ఐదు దేశాలు మాత్రమే పాల్గొనేలా మరో టోర్నీని నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోందట. 

Also Read: Yashasvi Jaiswal Big Six: యశస్వి జైస్వాల్‌ భారీ సిక్స్.. వాంఖడే స్టేడియం బయట బంతి! వైరల్ వీడియో

Also Read: Rohit Sharma-Yashasvi Jaiswal: టీమిండియాలోకి యశస్వి జైశ్వాల్‌.. హింట్‌ ఇచ్చిన కెప్టెన్ రోహిత్‌ శర్మ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News