Kohli-Anushka: అనుష్క శర్మ.. నేను డ్యాన్స్ బాగా చేస్తానా?! నవ్వులు పూయిస్తున్న విరాట్ కోహ్లీ ప్రశ్న
Anushka Sharma says Virat Kohli loves singing and dancing. ఇటీవల ముంబైలో జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పాల్గొన్నారు.
Anushka Sharma says Virat Kohli dance very well in floor: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో కలుసుకుని స్నేహితులు అయ్యారు. కొన్నాళ్లకు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. 5-6 ఏళ్లు ప్రేమించుకున్న కోహ్లీ-అనుష్క .. 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు 2021 జనవరి 11న వామికా అనే కూతురు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇద్దరు కూతురుతో ఎంజాయ్ చేస్తూనే.. ఎవరి కెరీర్‌లో వారు బిజీబిజీగా ఉన్నారు.
ఇటీవల ముంబైలో జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా విరుష్క జంట రాపిడ్ ఫైర్‌ను ఎదుర్కొన్నారు. రాపిడ్ ఫైర్‌లో భాగంగా డ్యాన్స్ ఫ్లోర్‌పై ఎవరి ప్రదర్శన బాగుంటుంది, ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేది ఎవరు అనే ప్రశ్న ఎదురైంది. వెంటనే కోహ్లీని చూపించింది అనుష్క. ఆమె సమాధానానికి కోహ్లీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. 'అనుష్క.. నేను డ్యాన్స్ బాగా చేస్తానా?. నిజం చెప్పు’ అని అనుష్కను కోహ్లీ అడుగుతాడు. దానికి ఆమె నిజమే కదా అని సమాధానం ఇస్తుంది.
అనుష్క శర్మ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'గతంలో ఏదైనా పార్టీకి వెళ్ళినపుడు మద్యం సేవిస్తే డ్యాన్స్ చేసేవాడిని. కానీ పార్టీకి హాజరైన వారు మాత్రం నేను అక్కడ ఉండాలని కోరుకోరు. అయితే దాన్ని నేను పెద్దగా పట్టించుకోను. ఇకపై మాత్రం తాగను' అని అన్నాడు. ఇటీవల నార్వేకు చెందిన అబ్బాయిల డ్యాన్స్ గ్రూప్ ‘క్విక్ స్టైల్’తో కోహ్లీ బ్యాట్ పట్టి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురిసింది.
ఐపీఎల్ 2023 కోసం విరాట్ కోహ్లీ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని బెంగళూరు చేరుకున్నాడు. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ ఏర్పాటు చేసిన అన్‌బాక్స్ ఈవెంట్‌లో విరాట్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా బెంగళూరు జట్టు తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. కార్యక్రమంలో మాజీ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ సందడి చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ముంబై ఇండియన్స్‌తో బెంగళూరు తలపడనుంది.
Also Read: Nitish Rana KKR Captain: నితీశ్ రాణాను కేకేఆర్ కెప్టెన్‌గా నియమించడానికి 3 కారణాలు ఇవే!
Also Read: MS Dhoni Paints Chairs: పెయింటర్ అవతారం ఎత్తిన ఎంఎస్ ధోనీ.. వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.