Nitish Rana KKR Captain: నితీశ్ రాణాను కేకేఆర్ కెప్టెన్‌గా నియమించడానికి 3 కారణాలు ఇవే!

Here is Three reasons why Nitish Rana appointed as kkr captain. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ప్రాంచైజీ నితీశ్ రాణాకే కెప్టెన్సీ పగ్గాలు అందించాడని మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 27, 2023, 07:20 PM IST
  • నితీశ్ రాణాను కేకేఆర్ కెప్టెన్‌గా నియమించడానికి కారణాలు ఇవే
  • మార్చి 31న ఐపీఎల్ 2023 ప్రారంభం
  • 300లకు పైగా స్కోర్లు
Nitish Rana KKR Captain: నితీశ్ రాణాను కేకేఆర్ కెప్టెన్‌గా నియమించడానికి 3 కారణాలు ఇవే!

Here is Three reasons why Nitish Rana appointed as kkr captain: కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ప్రాంచైజీ కొత్త‌ కెప్టెన్‌కు సంబందించిన ఊహాగానాల‌కు తెర‌దించింది. భారత బ్యాటర్ నితీశ్ రాణాకు కేకేఆర్ మేనేజ్మెంట్ కెప్టెన్సీ (Nitish Rana Captain) బాధ్య‌త‌లు అప్ప‌గించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ వెన్ను గాయం నుంచి కోలుకోక‌పోడంతో.. ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్ ఐపీఎల్ 2023లో కేకేఆర్‌కు సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. కొత్త‌ కెప్టెన్ రేసులో విండీస్ విధ్వంస‌క ఆట‌గాడు ఆండ్రూ ర‌స్సెల్, భారత ఆల్‌రౌండ‌ర్ శార్ధూల్ ఠాకూర్‌, వెస్టిండీస్ మిస్ట‌రీ స్పిన్న‌ర్ సునీల్ న‌రైన్‌ పేర్లు వినిపించినా.. చివరకు రాణాకు అదృష్టం వరించింది. 

ఢిల్లీకి చెందిన నితీశ్ రాణా 2016లో ఐపీఎల్ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2016, 2017 సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి అంచనాలకు మించి రాణించాడు. దీంతో  2018లో  కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ప్రాంచైజీ అతడిని వేలంలో భారీ ధరకు దక్కించుకుంది. గత 5 సంవత్సరాలుగా కేకేఆర్ తరఫున ఆడుతూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వరుసగా నాలుగు సీజన్లలో 300లకు పైగా స్కోర్లు చేశాడు. కేకేఆర్ తరఫున 74 మ్యాచులు ఆడిన రాణా.. 1744 రన్స్ చేశాడు. 91 ఐపీఎల్‌ మ్యాచ్‌లలో 2181 పరుగులు చేశాడు. అయితే నితీశ్ రాణాకే కెప్టెన్సీ పగ్గాలు (Nitish Rana Captain KKR) అందించాడని మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. 

ఢిల్లీ జట్టును నడిపించిన అనుభవం:
ఐపీఎల్ జట్టును నడిపించడానికి ముఖ్యమైన విషయాలలో అనుభవం ఒకటి. కెప్టెన్‌గా ఎలా వ్యవహరించాలో తెలిస్తే.. అతను తన సహచరుల నుంచి అత్యుత్తమ ప్రదర్శనలను రాబట్టగలడు. ఈ అనుభవం నితీశ్ రాణాకు ఉంది. దేశవాళీ స్థాయిలో ఢిల్లీకి రాణా కెప్టెన్‌గా ఉన్నాడు. మాజీ కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ తర్వాత ఢిల్లీ జట్టు పగ్గాలు రాణా అందుకున్నాడు. 

టీమ్ బ్యాలెన్స్‌:
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ వంటి అనుభవజ్ఞులైన విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అభిమానులు అయితే విదేశీ సారథిని ఎంచుకుంటుందని భావించారు. నరైన్ కెప్టెన్ అని పేర్కొన్నారు. అయితే కేకేఆర్ మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఓవర్సీస్ ఆటగాడిని కెప్టెన్‌గా నియమించిన్నపుడు టీమ్ బ్యాలెన్స్‌ దెబ్బతింది. అందుకే భారత ఆటగాడిని కెప్టెన్‌గా ఎంచుకోవాలని మేనేజ్‌మెంట్ నిర్ణయిచుకుంది. 

నితీష్ రాణా నిలకడ:
కోల్‌కతా కెప్టెన్‌గా ఎంపికయ్యే పోటీదారులలో శార్దూల్ ఠాకూర్ కూడా ఉన్నాడు. ఠాకూర్ మరియు రాణా ఇద్దరూ ఐపీఎల్‌లో ఎప్పుడూ కెప్టెన్‌గా వ్యవహరించలేదు. అయితే గత ఐదేళ్లుగా ఫ్రాంచైజీతో రాణా ఉన్నాడు. అంతేకాదు నిలకడగా రాణిస్తున్నాడు. వరుసగా నాలుగు సీజన్లలో 300లకు పైగా స్కోర్లు చేశాడు. ఇక రాణా కోచింగ్ సిబ్బంది, చాలా మంది కోల్‌కతా ఆటగాళ్లకు సుపరిచితుడు. కాబట్టి అతడినే  కెప్టెన్‌గా ఎంచుకుంది. 

Aslo Read: Upcoming Electric Cars: విడుదలకు సిద్ధంగా ఉన్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. పూర్తి వివరాలు ఇవే!  

Also Read: Best Mileage Cars 2023: బెస్ట్ మైలేజ్ 7 సీటర్ కార్లు ఇవే.. లీటర్‌పై 26 కిలోమీటర్లు! ధర 6 లక్షల నుంచి స్టార్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News