Virat Kohli - Arshdeep Singh: రాత్రంతా సీలింగ్ ఫ్యాన్నే చూశా.. అర్ష్‌దీప్ సింగ్ మిసింగ్ క్యాచ్‌పై విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే?
రాత్రంతా సీలింగ్ ఫ్యాన్నే చూశా అర్ష్‌దీప్ మిసింగ్ క్యాచ్‌పై కోహ్లీ ఏమన్నాడంటే సోషల్ మీడియాలో విమర్శల వర్షం
IND vs PAK Asia Cup 2022, Virat Kohli reacts after Arshdeep Singh drops Asif Ali Catch: ఆసియా కప్ 2022 సూపర్ 4లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే భారత్ ఓడిపోయింది. ఇరు జట్ల మధ్య గెలుపు దొబూచులు ఆడినా.. చివరికి అనూహ్య రీతిలో రోహిత్ సేన ఓటమి పాలైంది. భారత బ్యాటర్లు పర్వాలేదనిపించినా.. బౌలర్లు విఫలం కావడంతో భారత్ ఓడిపోక తప్పలేదు. ఇక ఫీల్డింగ్ వైఫలంతో చేతులో ఉన్న మ్యాచును చేజార్చుకుని భారీ మూల్యం చెల్లించుకుంది. టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ డ్రాప్ అని అందరూ అంటున్నారు.
ఛేదనలో పాకిస్తాన్ 17వ ఓవర్ ముగిసేసరికి 4 వికెట్లకు 148 రన్స్ చేసింది. పాక్ విజయానికి చివరి మూడు ఓవర్లలో 34 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలో తరుణంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ బంతి అందుకున్నాడు. రెండు వైడ్లు వేసి అప్పుడే క్రీజులోకి వచ్చిన ఆసిఫ్ అలీ లయ దెబ్బతీసేలా చేశాడు. 3వ బంతికి ఆసిఫ్ భారీ షాట్ ఆడగా.. బంతి గాల్లోకి లేచింది. షార్ట్ థర్డ్ మ్యాన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అర్ష్‌దీప్ సింగ్ సునాయాస క్యాచ్‌ను వదిలేశాడు. నేరుగా వచ్చి చేతిలో పడినా.. అతడు క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. అర్ష్‌దీప్ లడ్డూ లాంటి క్యాచ్‌ను డ్రాప్ చేయడంతో సోషల్ మీడియాలో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది.
అర్ష్‌దీప్ సింగ్ మిసింగ్ క్యాచ్‌పై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఒత్తిడిలో ఎవరైనా తప్పులు చేస్తారని, తాను కూడా కెరీర్ ఆరంభంలో ఇలాంటి ఒత్తిడికి గురయ్యానని చెప్పాడ. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ... 'ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో నా మొదటి మ్యాచ్ ఆడినప్పుడు నేను ఓ చెత్త షాట్ ఆడి ఔట్ అయ్యాను. చాలా నిరాశ చెందా. ఆ రోజు రాత్రి నేను నిద్రేపోలేదు. రాత్రంతా సీలింగ్ ఫ్యాన్ చూస్తూనే ఉన్నా. నా కెరీర్ ముగిసిందనిపించింది. అయితే ఆడుతున్న కొద్దీ కొన్ని విషయాలు జరిగిపోయాయి. వాటినుంచి నేర్చుకున్నా' అని అన్నాడు.
'ఒత్తిడిలో ఎవరైనా పొరపాట్లు చేయడం, బాధపడటం సహజమే. మేనేజ్‌మెంట్ మరియు కెప్టెన్ ఎవరైనా తన తప్పును అంగీకరించాలి. తప్పును పరిష్కరించుకుని.. మరోసారి అలా జరగకుండా చూసుకోవాలి. అర్షదీప్ సింగ్ కుర్రాడు. అతడు ఇంకా చాలా నేర్చుకునే టైం ఉంది. ఈ క్యాచ్ గురించి అర్షదీప్ మర్చిపోయి ముందుకు సాగాలి. అర్షదీప్ మరింత గొప్ప ప్రదర్శన ఇచ్చేదుకు ట్రై చేయాలి' అని విరాట్ పేర్కొన్నాడు. కేవలం 20 బంతుల్లోనే 42 పరుగులు చేసిన మహ్మద్ నవాజ్ ఇన్నింగ్స్ ఆటలో కీలక మలుపు అని కోహ్లీ అంగీకరించాడు.
Also Read: అర్షదీప్ సింగ్ కనబడితే కాల్చేస్తా.. బైక్‌పై బయలుదేరిన టీమిండియా ఫాన్స్!
Also Read: నేడు 255 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే! వివరాలు ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook