India may face Pakistan in Asia Cup 2022 Super 4: ఆసియా కప్ 2022లో భారత్ హవా కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటుతున్న రోహిత్ సేన సూపర్ 4కు చేరుకుంది. గ్రూప్-ఏలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో గెలుపొందిన భారత్.. ఆపై హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచులో కూడా జయకేతనం ఎగురవేసింది. రెండు వరుస విజయాలతో టీమిండియా సూపర్ 4కు చేరింది. సూపర్ 4లో భాగంగా భారత్ తన తదుపరి మ్యాచ్‌ను ఆదివారం ఆడనుంది. అయితే భారత్ ప్రత్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రూప్-ఏలో భాగంగా పాకిస్తాన్, హాంకాంగ్ జట్ల మధ్య ఈరోజు రాత్రి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సూపర్ 4కు అర్హత సాధిస్తుంది. అంతేకాదు సూపర్ 4లో భాగంగా తన తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఎదుర్కొంటుంది. ఓడిన జట్టు మాత్రం ఇంటిదారి పడుతుంది.  పాకిస్తాన్, హాంకాంగ్ జట్లలో పాక్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్న పాక్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే దాయాది దేశాలు మరోసారి తలపడనున్నాయి. 


ఆసియా కప్ 2022 గ్రూప్-బి నుంచి ఇప్పటికే బంగ్లాదేశ్ వైదొలగిన విషయం తెలిసిందే. బంగ్లా ఆడిన రెండు మ్యాచులలో ఓడి ఇంటిదారి పట్టింది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్, రెండో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో బంగ్లా ఓటమిపాలైంది. గ్రూప్-బి నుంచి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సూపర్ 4కు అర్హత సాధించాయి. ఇక గ్రూప్-ఏ నుంచి భారత్ సూపర్ 4కు చేరగా.. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో గెలిచిన టీమ్ తదుపరి రౌండ్ చేరుకుంటుంది. ఇక ఓడిన జట్టు టోర్నీ నుంచి బయటికి వెళ్తుంది. 


India Super Four Schedule:
# Sep 04-India vs TBC (Pakistan or Hong Kong)
# Sep 06-India vs Sri Lanka
# Sep 08-India vs Afghanistan


Also Read: ఏదేమైనా పెండ్లి అయితే క‌రెక్ట్ టైంలోనే జ‌ర‌గాలిరా.. ఆసక్తిగా 'ఒకే ఒక జీవితం' ట్రైల‌ర్‌!


Also Read: మైండ్ బ్లాకింగ్ కాంబో.. ఒకే ఫ్రేమ్‌లో రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, రష్మిక, త్రిష, దీపికా! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook