Team India worried about KL Rahul bad form: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల కళ్లు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్ 2022 పైనే ఉన్నాయి. ఆగష్టు 27న మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌లో 29న పాకిస్థాన్‌తో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ 2021లో పాకిస్థాన్‌పై భారత్ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. దాంతో పాకిస్థాన్‌పై భారత జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ ఫామ్ కలవరపెడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 తర్వాత కేఎల్ రాహుల్‌ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. జూన్ నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో సారథిగా ఆడాల్సి ఉన్నప్పటికీ.. గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఆపై ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమయ్యాడు. జర్మనీ వెళ్లి గాయానికి చికిత్స తీసుకుని వచ్చిన రాహుల్.. ఎన్‌సీఏలో శిక్షణ తీసుకున్నాడు. ఇక వెస్టిండీస్ టూర్‌లో ఆడాల్సి ఉన్నా.. కరోనా బారిన పడడంతో దూరమయ్యాడు. సుదీర్ఘ విరామం తరువాత రాహుల్ జింబాబ్వేపై ఆడాడు. 


కేఎల్ రాహుల్‌ జింబాబ్వేపై సిరీస్ ద్వారా కోల్పోయిన ఫామ్‌ను తిరిగి పొందుతాడని అందరూ భావించారు. అయితే బలహీన జింబాబ్వేపై ఆశించిన స్థాయిలో ఆడలేదు. అతని బ్యాటింగ్ మరింత ఆందోళనకరంగా మారింది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగకపోయినా.. తర్వాతి మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. మూడో వన్డేలో 30 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఆసియా కప్‌ 2022లో పాకిస్థాన్, శ్రీలంక వంటి పెద్ద జట్ల మ్యాచులకు ముందు రాహుల్ ఫామ్ ఆందోళన కరంగా మారింది.  


కేఎల్ రాహుల్ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే.. ఓపెనింగ్ చేసే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు. రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. గతంలో కూడా రోహిత్‌తో కలిసి కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. రిషబ్ పంత్‌ రూపంలో మరో అప్షన్ కూడా ఉంది. అప్పుడు రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. 


Also Read: ADANI NDTV DEAL: మీడియా కాదు మోడియా... ఎన్డీటీవీ అదానీ డీల్ పై కేటీఆర్ సెటైర్లు


Also Read: AP, TS POLICE FIGHT: ఏడేళ్ల క్రితం సీన్ రిపీట్.. నాగార్జున సాగర్ లో ఏపీ, తెలంగాణ పోలీసుల ఫైటింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి