Asia Cup 2023: మరో 13 రోజుల్లో ఆసియా కప్ 2023 ప్రారంభం కానుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇండియా, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్ దేశాలతో జరగనున్న ఆసియా కప్ 2023కు టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు.. అయితే ఈ కప్ కోసం ప్లేయింగ్ 17 సభ్యులు ఎవరనేది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వివిధ కారణాలతో ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కలేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో రెండు వారాల్లో ఆసియా కప్ 2023 ప్రారంభం కానుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకూ జరిగే టోర్నీలో తొలి మ్యాచ్ నేపాల్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగనుది. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ జట్లు ప్రకటితం కాగా ఇండియా, శ్రీలకం, ఆఫ్ఘనిస్తాన్ జట్టు తేలాల్సి ఉంది. టీమ్ ఇండియాకు గాయాల బెడద పీడిస్తోంది. బహుశా అందుకే బీసీసీఐ జట్టును ఇంకా ప్రకటించకపోయుండవచ్చు. అయితే అదే సమయంలో ఆసియా కప్ 2023కు ప్లేయింగ్ 17 ఇదేనంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. 


టీమ్ ఇండియా ప్లేయింగ్ 17 అంచనా జట్టు ఇదే


రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సంజూ శామ్సన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బూమ్రా, శార్దూల్ ఠాకూర్, మకేష్ కుమార్.


ఈ టీమ్‌లో స్టార్ ఆటగాళ్లు సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ పేరు లేకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. సూర్య కుమార్ యాదవ్‌ను ఎందుకు తీసుకోవడం లేదో తెలియదు. తిలక్ వర్మను అప్పుడే మెగా ఈవెంట్‌కు తీసుకోవడం సరికాదనే అభిప్రాయలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లను జట్టులోకి తీసుకోనున్నట్టు సమాచారం. వాస్తవానికి వెస్డిండీస్ టీ20 సిరీస్‌లో తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగా రాణించారు. కానీ ఆసియా కప్ 2023 జట్టులో ఈ ఇద్దరికీ బీసీసీఐ స్థానం కల్పించడం లేదనే తెలుస్తోంది. మరోవైపు టీమ్ ఇండియా పేస్ బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసేందుకు ముకేష్ కుమార్ పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. 


ఆసియా కప్ 2023 ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ బరిలో దిగే అవకాశాలున్నాయి. మూడవ స్థానంలో కోహ్లీ అడవచ్చు. ఇక శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లు 4,5 స్థానాల్లో ఆడవచ్చు. ఈ ఇద్దరికీ బ్యాకప్‌లో ఇషాన్ కిషన్, సంజూ శామ్సన్ ఉండనే ఉంటారు. ఇక రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌లు ఆల్ రౌండర్లుగా ఉంటారు. పేస్ విభాగంలో మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బూమ్రా, శార్దూల్ ఠాగూర్ ముకేష్ కుమార్ ఉండవచ్చు.


Also read: Rishabh Pant: గ్రౌండ్‌లోకి రిషభ్‌ పంత్ రీఎంట్రీ.. సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook