Shane Warne Funerals: బ్యాంకాక్ నుంచి ఆస్ట్రేలియాకు రేపు చేరుకోనున్న షేన్‌వార్న్ మృతదేహం
Shane Warne Funerals: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ప్రముఖ స్పిన్నర్ షేన్‌వార్న్ భౌతికదేహం స్వస్థలానికి ఇవాళ తరలించారు. మరణంపై సందేహాలు, అటాప్సీ పరీక్ష నివేదిక నేపధ్యంలో ఆలస్యమైంది.
Shane Warne Funerals: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ప్రముఖ స్పిన్నర్ షేన్‌వార్న్ భౌతికదేహం స్వస్థలానికి ఇవాళ తరలించారు. మరణంపై సందేహాలు, అటాప్సీ పరీక్ష నివేదిక నేపధ్యంలో ఆలస్యమైంది.
ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్‌వార్న్ తీవ్రమైన గుండెపోటుతో థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో మరణించిన విషయం తెలిసిందే. షేన్‌వార్న్ మరణంపై అనుమానాలుండటం, అటాప్సీ పరీక్ష చేయించాల్సిన పరిస్థితి ఉండటంతో షేన్‌వార్న్ భౌతికదేహం తరలింపు ఆలస్యమైంది. మార్చ్ 4వ తేదీన మరణించినా ఇవాళ్టి వరకూ స్వదేశం ఆస్ట్రేలియాకు తరలింపు జరగలేదు. అటాప్సీలో షేర్‌వార్న్‌ది సాధారణ మరణమేనని థాయ్‌లాండ్ పోలీసులు ధృవీకరించడంతో తరలింపు ప్రక్రియ ప్రారంభించారు. ఇవాళ థాయ్‌లాండ్ నుంచి షేన్‌వార్న్ మృతదేహాన్ని బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. రేపటిలోగా స్వదేశం ఆస్ట్రేలియాకు చేరనుంది షేన్‌వార్న్ భౌతికదేహం.
మార్చ్ 30 న షేన్‌వార్న్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఆస్ట్రేలియా నిర్వహించనుంది. మెల్‌బోర్న్ క్రికెట్ స్డేడియంలో అత్యంత ఘనంగా జరగనున్నాయి. మార్చ్ 30 వరకూ అభిమానులు, సన్నిహితులు, బంధువులు కడసారి వీడ్కోలు పలికేందుకు వీలుగా ప్రజల సందర్శనార్ధం ఉంచుతున్నారు. ఇదే స్డేడియం గ్రౌండ్‌లో షేన్‌వార్న్ 7 వందల వికెట్ తీశాడు.
Also read: NZW vs INDW: చెలరేగిన న్యూజిలాండ్ బ్యాటర్‌లు.. భారత్ లక్ష్యం 261!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook