Pooja Vastrakar four fer restricts New Zealand to 260/9: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా సెడ్డెన్ పార్కు స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసిన న్యూజిలాండ్.. భారత్ ముందు 2621 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ బ్యాటర్లు అమీ సత్తర్‌వైట్ (75), అమెలియా కెర్ (50) హాఫ్ సెంచరీలు చేయగా.. కెటీ మార్టిన్(41), సోఫీ డివైన్(35) రాణించారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లు తీయగా.. రాజేశ్వరి గైక్వాడ్ 2, ఝులన్ గోస్వామి ఓ వికెట్ తీశారు.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకువడటంతో న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కివీస్ జట్టుకు టీమిండియా పేసర్ పూజా వస్త్రాకర్ షాక్ ఇచ్చింది. ఓపెనర్ సుజీ బేట్స్ (5)ను రనౌట్ చేసింది. ఈ సమయంలో కెప్టెన్ సోఫీ డివైన్ (35), అమెలియా కెర్ జట్టును ఆదుకున్నారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు చేశారు. దాంతో కివీస్ స్కోర్ 50 పరుగులు దాటింది. అనంతరం పూజా బౌలింగ్‌లో డివైన్ క్యాచ్ ఔట్ అయింది.
అమీ సత్తర్‌వైట్, అమెలియా కెర్ మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో కివీస్ స్కోర్ 120 చేరుకుంది. హాఫ్ సెంచరీ చేసిన అమెలియా పెవిలియన్ చేరినా.. మ్యాడీ గ్రీన్ అండతో సత్తర్‌వైట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపింది. ఈ క్రమంలోనే సత్తర్‌వైట్ అర్ధ శతకం చేసింది. ఈ జోడి నిష్క్రమణ అనంతరం కెటీ మార్టిన్ 41 పరుగులు చేయడంతో కివీస్ భారీ స్కోర్ చేసింది.
Innings Break!
A solid performance with the ball by #TeamIndia ! 👏 👏
4⃣ wickets for @Vastrakarp25
2⃣ wickets for Rajeshwari Gayakwad
1⃣ wicket each for @JhulanG10 & @Deepti_Sharma06Over to our batters now. 👍 👍
Scorecard▶️ https://t.co/zZzFTtBxPb#CWC22 | #NZvIND pic.twitter.com/0lqxUpjb8y
— BCCI Women (@BCCIWomen) March 10, 2022
భారత పేసర్ పూజా వస్త్రాకర్ తన కోటా పది ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి 34 పరుగులు ఇచ్చింది. రాజేశ్వరీ గ్రైక్వాడ్ 2, దీప్తి శర్మ , గోస్వామి చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం చేధనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ స్మృతి మంధాన 6 పరుగులకే ఔట్ అయింది. ప్రస్తుతం భారత్ 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 26 రన్స్ చేసింది.
Also Read: Magic Figure: మేజిక్ ఫిగర్ అంటే ఏంటి, ఐదు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మేజిక్ ఫిగర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook