Rafael Nadal Prize Money: టెన్నిస్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించిన నాదల్‌కు ఎంత ప్రైజ్ మనీ వచ్చిందంటే?
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మెన్స్ సింగల్స్ టైటిల్ విజేతగా నిలిచిన రఫెల్ నాదల్‌కు 2,875,000 ఆస్ట్రేలియా డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. అంటే భారత కరెన్సీలో దాదాపుగా రూ.15 కోట్లు.
Rafael Nadal won 15 crores Prize Money: ఓపెన్ టెన్నిస్ ఎరాలో స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ప్లేయర్‌గా రఫా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మెన్స్ సింగల్స్ ఫైనల్లో రష్యా స్టార్ ప్లేయర్ డానిల్ మెద్వెదెవ్‌పై 2-6, 6-7(5-7),6-4, 6-4, 7-5 తేడాతో సంచలన విజయం నమోదు చేశాడు. దాంతో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను రఫా తన ఖాతాలో వేసుకున్నాడు.
మ్యాచ్ ఆరంభంలో డానిల్ మెద్వెదెవ్ దూకుడు చుస్తే.. టైటిల్ అతడిదే అనిపించింది. వరుసగా రెండు సెట్‌లలో అద్భుతంగా ఆడి రఫెల్ నాదల్‌కు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా మొదటి సెట్‌లో మెద్వెదెవ్ ఆట అదిరిపోయింది. అయితే మూడో సెట్‌లో మెద్వెదెవ్ కాస్త వెనకబడడంతో రఫా పుంజుకున్నాడు. ఇద్దరూ హోరాహోరీగా పోరాడినా.. చివరకు నాదల్ తన అనుభవాన్ని ఉపయోగించి మ్యాచ్ గెలిచాడు. వరుసగా మూడు సెట్లు కోల్పోయిన మెద్వెదెవ్ రన్నరప్‌గా నిలిచాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మెన్స్ సింగల్స్ టైటిల్ విజేత, రన్నరప్‌కు ఎంత మొత్తంలో నగదు బహుమతి లభించిందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. విజేతగా నిలిచిన రఫెల్ నాదల్‌కు 2,875,000 ఆస్ట్రేలియా డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. అంటే భారత కరెన్సీలో దాదాపుగా రూ.15 కోట్లు. రన్నరప్ మెద్వెదెవ్‌కు 1,575,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.8 కోట్లు) దక్కింది. ఇక మహిళల విజేతగా నిలిచిన ఆష్లీ బార్టీకి 2.875 ఆస్ట్రేలియా డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్ డేనియల్ కాలిన్స్ 1.575 డాలర్ల ప్రైజ్‌మనీ దక్కింది.
Also Read: Viral Video: హైవే రోడ్డుపై 4 కిమీ మండుతూ వెళ్లిన ట్రక్కు.. చివరకు ఏమైందంటే? (వీడియో)!!
Also Read: Viral Video: ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తూ.. ఊహించని పని చేసిన ఫ్యాషన్ మోడల్ (వీడియో)!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook