Novak Djokovic: చరిత్ర సృష్టించిన నొవాక్ జోకోవిచ్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో విక్టరీ
Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తనకు ఎదురులేదని నోవాక్ జకోవిచ్ నిరూపించుకున్నాడు. ఫైనల్లో గ్రీస్‌కు ప్లేయర్ సిట్‌పిటాస్‌ను 6-3, 7-6, 7-6తో వరుస సెట్లలో ఓడించి హిస్టరీ క్రియేట్ చేశాడు. తన ఖాతాలో 10వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ వేసుకోగా.. ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన రఫెల్ నాదల్ (22)ను సమం చేశాడు.
Australian Open 2023: సెర్బియా దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విన్ అయ్యాడు. కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి స్పెయిన్ ఆటగాడు రఫెల్ నాదల్‌ను సమం చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో గ్రీస్‌కు చెందిన సిట్‌పిటాస్‌ను ఓడించాడు. 6-3, 7-6, 7-6తో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను 10వ సారి తన ఖాతాలో వేసుకున్నాడు. రఫెల్ నాదల్ కూడా 10 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా ప్రపంచంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు నొవాక్ జకోవిచ్.
కోవిడ్ కారణంగా ఈ ఛాంపియన్ ప్లేయర్ గత సీజన్‌లో ఆడలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు టోర్నమెంట్ నిర్వాహకులు టీకాను తప్పనిసరి చేశారు. అయితే నోవాక్ తన టీకా సంబంధిత సమాచారాన్ని పబ్లిక్‌గా చేయడానికి ఇష్టపడలేదు. దీంతో టోర్నీ నిర్వాహకులు జకోవిచ్‌పై నిషేధం విధించడంతో ఆసీస్‌కు వెళ్లినా ఆడలేకపోయాడు. దీంతో గత సీజన్‌కు దూరమై అవమానపడ్డ నోవాక్.. ఈసారి టైటిల్ సొంతం చేసుకున్నాడు. నాలుగో సీడ్ నొవాక్ జకోవిచ్ గ్రీస్‌కు చెందిన సిట్సిపాస్‌ను వరుస సెట్లలో ఓడించాడు. తొలి సెట్‌ను 6-3తో జకోవిచ్ సులువుగా కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత సెర్బియా స్టార్ రెండో, మూడో సెట్లలో విజయం సాధించేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది.
రఫెల్ నాదల్ ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవగా.. తాజాగా జకోవిచ్ ఆ రికార్డును సమం చేశాడు. ఈ టోర్నీలో గాయం కారణంగా నాదల్ మొదట్లోనే తప్పుకోవడంతో జకోవిచ్‌కు కలిసి వచ్చింది. ఈ గెలుపుతో టైటిల్‌తోపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను మళ్లీ సొంతం చేసుకున్నాడు. రాబోయే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎవరో ఒకరు అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఆటగాళ్ల నిలిచే అవకాశం ఉంది.
Also Read: Nandamuri Tarakaratna: నా గుండె పగిలిపోయింది.. తారకరత్న ఆరోగ్యంపై నారా లోకేష్ ఎమోషనల్
Also Read: IND vs NZ 2nd T20: రెండో టీ20లో టాస్ గెలిచిన కివీస్.. టీమిండియాలో కీలక మార్పు.. తుది జట్లు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి