Babar Azam says I Don't Want to reveal Conversation With Virat Kohli During T20 World Cup 2021: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2021 ముగిసి దాదాపుగా నెల కావొస్తోంది. పొట్టి కప్ టైటిల్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఫైనల్ మ్యాచులో న్యూజీలాండ్ జట్టును ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి టైటిల్ ముద్దాడింది. మెగా టోర్నీలో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. సూపర్ 12కు కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. టోర్నీ ఆరంభంలోనే పాకిస్తాన్, న్యూజీలాండ్ జట్లపై ఓడిన భారత్.. ఆపై చిన్న జట్లపై మూడు విజయాలు సాధించినా ఫలితం లేకూండా పోయింది. మరోవైపు వరుస విజయాలతో సెమీస్ చేరిన పాకిస్తాన్.. కూడా ఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది. అయితే భారత్, పాకిస్తాన్ (IND vs PAK) మ్యాచ్‌ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్ల మధ్య జరిగిన ఓ సంభాషణ ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2021లో భారత్‌, పాకిస్తాన్ ( (IND vs PAK)) జట్ల మధ్య జ‌రిగిన మ్యాచులో టాస్ (Toss) కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. టాస్ సమయంలో పాక్ కెప్టెన్ బాబార్ ఆజ‌మ్ (Babar Azam) టీమిండియా సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli)తో ఏదో చెవిలో మాట్లాడాడు. దానికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. వెస్టిండీస్‌తో పాకిస్తాన్ ఆడ‌బోయే సిరీస్‌కు ముందు ఆదివారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో బాబర్‌ పాల్గొనగా.. రిపోర్ట‌ర్లు బాబర్‌ను ప‌దే ప‌దే ఒకే ప్రశ్న (టాస్ సమయంలో విరాట్ కోహ్లీ చెవిలో ఏం మాట్లాడారు) అడిగారు. దాంతో విసిగిపోయిన పాక్ కెప్టెన్ ముందుగా మీడియాపై అసహనం వ్యక్తం చేసి.. ఆపై తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. 


Also Read: Dish TV vs Yes Bank case: యస్ బ్యాంకు కుట్రలపై SEBI కి ఫిర్యాదు చేసిన డిష్ టీవీ


మీడియాతో పాక్ కెప్టెన్ బాబార్ ఆజ‌మ్ (Babar Azam) మాట్లాడతూ.. 'టాస్ సమయంలో మేము మేం చర్చించుకున్నామో వాటిని అంద‌రి ముందు నేను చెప్ప‌ను. అది మా ఇద్ద‌రి మ‌ధ్య విష‌యం అది. దానిని మీ ముందు చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అదో పెద్ద సీక్రెట్ అని నేను భావిస్తున్నాను' అని అన్నాడు. దాంతో భారత్, పాకిస్తాన్ మ్యాచుపై విలేకరులు మరో ప్రశ్న వేయకుండా మౌనంగా ఉండిపోయారు. అయితే వెస్టిండీస్‌ పర్యటన గురించి అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. అక్టోబరు 24న దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై పాక్ ఘన విజయం సాధించింది. దాంతో టీ20 ప్ర‌పంచక‌ప్‌లో పాకిస్తాన్ 29 ఏళ్ల త‌రువాత భార‌త్‌పై  విజ‌యం సాధించింది.


Also Read: Harnaaz Sandhu: మోడలింగ్​ నుంచి మిస్​ యూనివర్స్​ వరకు హర్నాజ్ సంధూ ప్రయాణం ఇలా..


పాకిస్థాన్‌ (Pakistan)తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్ (West Indies) జట్టు డిసెంబర్ 9న కరాచీకి చేరుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో పాక్ గడ్డపై అడుగుపెట్టిన విండీస్ ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించగా.. రోస్టన్‌ ఛేజ్‌, షెల్డన్‌ కాట్రెల్‌, కైల్‌ మేయర్స్‌తో పాటు జట్టు సిబ్బందిలో ఓ వ్యక్తి  వైరస్‌ బారినపడినట్లు తేలింది. ఈ నలుగురిని ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచామని విండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. మిగతా ఆటగాళ్లు అందరికీ నెగెటివ్‌గా రావడంతో ఆదివారం నుంచి ప్రాక్టీస్‌ మొదలెట్టారు. కరోనా కేసులు నమోదైనా సిరీస్‌ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని విండీస్ బోర్డు వెల్లడించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook