Air dismissed Nic Maddinson in Mark Steketee bowling in BBL 2022: క్రికెట్ ఆటలో అప్పుడప్పుడు ఎవరూ ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. మైదానంలో బౌలర్, బ్యాటర్, ఫీల్డర్లు కొన్నిసార్లు అద్భుత ప్రదర్శలనతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తారు. బౌలర్, బ్యాటర్, ఫీల్డర్లు మాత్రమే కాదు తాను కూడా అద్భుతాలు చేస్తానంటోంది ప్రకృతి. బిగ్ బాష్ లీగ్ 2022లో భాగంగా బ్రిస్బేన్ హీట్‌, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గాలి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. వికెట్స్ పైన ఉండే బెయిల్స్‌ను కిందపడేసి బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపించేంత పని చేసింది. వివరాల్లోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌ను మార్క్‌ స్టెకెటీ వేయగా.. నిక్ మాడిన్సన్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. స్టెకెటీ స్లో బౌన్సర్ వేయగా.. మాడిన్సన్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా బలంగా షాట్‌ ఆడాడు. మాడిన్సన్ షాట్‌ ఆడే సమయంలోనే స్టంప్స్‌ బెయిల్స్‌ ఒక్కసారిగా కిందపడిపోయాయి. మాడిన్సన్ స్టంప్స్‌ను తన కాలితో తాకడంతోనే బెయిల్స్‌ కిందపడ్డాయని అంతా భావించారు. బ్యాటర్ మాడిన్సన్‌కు కూడా ఏం జరిగిందో అర్ధం కాలేదు. హిట్‌ వికెట్‌ అయ్యాని భావించి డగౌట్ వైపు నడవడం ప్రారంభించాడు. ఔట్‌పై సందేహం ఉన్న ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు.


అయితే టీవీ రీప్లేలో గ్రౌండ్‌లో జరిగిన ఆశ్చర్య ఘటనకు సంబందించిన దృశ్యాలు ప్లే అయ్యాయి. నిక్ మాడిన్సన్ షాట్ ఆడినా.. అతడి బ్యాట్‌ గానీ, బాడీ గానీ తాకినట్టు ఎక్కడా కనబడలేదు. బెయిల్స్‌ గాలికి పడి ఉంటాయిని భావించిన థర్డ్‌ అంపైర్‌.. మాడిన్సన్ నాటౌట్‌ అని ప్రకటించాడు. ఆపై మాడిన్సన్ బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ ఘటనతో మైదానంలోని అందరూ కాసేపు గందరగోళానికి గురయ్యారు. విషయం తెలిసి.. అందరూ తెగ నవ్వుకున్నారు. 



బెయిల్స్‌ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఈ వీడియోకి నెటిజన్లు కామెంట్ల, లైకుల వర్షం కురిపిస్తున్నారు. 'ఇదేందయ్యో ఇది.. ఇది నేను ఎక్కడా చూడలే' అని ఒకరు కెమెంట్ చేయగా.. 'ప్రకృతి ఎంత పని చేసింది' అని మరొకరు ట్వీట్ చేశారు. 'అంతా గాలి మహిమ', 'క్రికెట్‌ చరిత్రలోనే అరుదైన ఘటన', 'ఈ నెలకు ఏమైంది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ 22 పరుగుల తేడాతో బ్రిస్బేన్ హీట్‌పై విజయం సాధించింది.  


Also Read: Best Electric Bike: అత్యంత చవకైన ఎలక్ట్రిక్ బైక్‌.. పూర్తి ఛార్జ్‌తో 135 కిలోమీటర్ల ప్రయాణం! హైదరాబాద్‌ సంస్థదే ఈ బైక్  


Also Read: IND vs BAN: 25 ఏళ్ల తర్వాత.. రాహుల్ ద్రవిడ్‌కు అలన్ డొనాల్డ్ క్షమాపణలు! డిన్నర్‌కి కూడా పిలిచాడు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.