Bangladesh beat India in 2nd ODI and clinch series: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయింది. 272 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 రన్స్ చేసి.. 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి బంతికి ఆరు పరుగులు చేయాల్సి ఉండగా.. రోహిత్ శర్మ ఒక పరుగు మాత్రమే చేశాడు. గాయపడిన రోహిత్ (51) ఇన్నింగ్స్ చివరలో వచ్చి ఒంటరి పోరాటం చేశాడు. శ్రేయస్‌ అయ్యర్ (82), అక్షర్‌ పటేల్ (56) హాఫ్ సెంచరీలు చేశారు. ఈ ఓటమితో వన్డే సిరీస్‌ బంగ్లా సొంతమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

272 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (5), శిఖర్ ధావన్‌ (8) తక్కువ పెరుగులకే పెవిలియన్‌కు చేరారు. కోహ్లీని ఎబాడట్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయగా.. ముస్తాఫిజర్‌ బౌలింగ్‌లో ధావన్‌ క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆపై వాషింగ్టన్ సుందర్ (11) షకిబ్ బౌలింగ్‌లో లిటన్ దాస్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మరికొద్ది సేపటికే మెహిదీ హసన్‌ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (14) ఔట్ అయ్యాడు. దీంతో 65 పరుగులకే కీలక నాలుగో వికెట్‌లు కోల్పోయి భారత్‌ కష్టాల్లో పడింది. 


ఈ సమయంలో శ్రేయస్‌ అయ్యర్, అక్షర్ పటేల్ జట్టును ఆదుకున్నారు. ఇద్దరు కలిసి ఆచితూచి ఆడుతూ పరుగులు చేశారు. ఈ క్రమంలో శ్రేయస్‌ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఐదో వికెట్‌కు శతక భాగస్వామ్యం నిర్మించారు. ఆపై మెహదీ హసన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన అయ్యర్ ఔట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ అనంతరం అక్షర్‌ పటేల్ ఔట్ కాగా.. దీపక్ చహర్ (11), శార్దూల్ ఠాకూర్ (7) విఫలమయ్యారు. దాంతో భారత్ ఓటమి ఖాయం అయింది. అయితే ఇక గాయం కారణంగా డగౌట్‌కు పరిమితమైన రోహిత్ శర్మ సిక్సులు బాదడంతో భారత్ రేసులోకి వచ్చింది. చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా.. ముస్తాఫిజర్‌ 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో బంగ్లాదేశ్‌ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లా 2-0 తేడాతో కైవసం చేసుకొంది. నామమాత్రమైన చివరి మ్యాచ్‌ శనివారం జరగనుంది.



ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 రన్స్ చేసింది. మెహిదీ హసన్ (100 నాటౌట్) సెంచరీ బాధగా.. మహముదుల్లా (77) హాఫ్ సెంచరీ బాదాడు. 19 ఓవర్లకు బంగ్లా స్కోర్ 69/6. టాప్‌ ఆర్డర్‌ అంతా పెవిలియన్‌కు చేరడంతో..  వందలోపే ఆలౌట్ అవుతారని అంతా అనుకొన్నారు. కానీ మహముదుల్లా, మెహిదీ హసన్ టీమిండియాకు ఆ అవకాశం ఇవ్వలేదు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్స్ పడగొట్టగా.. సిరాజ్, మాలిక్ తలో రెండు వికెట్లు తీశారు.


Also Read: IMDb Top Actors in India: 2022 మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ స్టార్స్‌ జాబితా.. టాప్‌లో ధనుష్‌! చెర్రీ, తారక్ ఏ స్థానాల్లో ఉన్నారంటే  


Also Read: KGF Actor Died: కేజీఎఫ్‌ నటుడు కన్నుమూత.. రాఖీభాయ్‌ పవరేంటో చూపాడు ఈ తాత!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.