ODI World Cup 2022: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ ఔట్!!
Bangladesh beat Pakistan in ICC Women`s World Cup 2022. మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో బంగ్లాదేశ్ తొలి విజయాన్ని అందుకుంది. సోమవారం హామిల్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో బంగ్లా విజయం సాధించింది.
Bangladesh beat Pakistan in ICC Women's World Cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో బంగ్లాదేశ్ తొలి విజయాన్ని అందుకుంది. సోమవారం హామిల్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో బంగ్లా విజయం సాధించింది. దీంతో వన్డేల్లో పాకిస్తాన్‌పై తొలి విజయం సాధించి చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో పాక్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 225 పరుగులు మాత్రమే చేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఓపెనర్ షమీమా సుల్తానా (17) విఫలమయినా.. మరో ఓపెనర్ షర్మిన్ అక్తర్ (44) పర్వాలేదనిపించింది. ఫర్గానా హోక్ (71) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. నిగర్ సుల్తానా (46) పరుగులతో సత్తా చాటింది. ఆపై రుమానా అహ్మద్ 16, రీతు మోని 11, ఫాహిమా ఖాతున్ 0 ఫీవలమయ్యారు. పాక్ బౌలర్లలో నష్రా సంధు 3 వికెట్లు పడగొట్టింది.
235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు శభారంభాన్ని అందించారు. నహిదా ఖాన్, సిద్రా అమీన్ ఆచితూచి ఆడుతూ పరుగులు చిహ్సారు. ఏ క్రంమలోనే తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించారు. అయితే 43 పరుగులు చేసిన ఖాన్‌ను రుమానా బోల్డ్ చేసింది. 31 పరుగులు చేసిన బిస్మా మరూఫ్ ఔటైంది. 182/2తో పటిష్ట స్థితిలో ఉన్న పాకిస్థాన్‌ను బంగ్లా బౌలర్లు దెబ్బకొట్టారు. 6 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టారు. దీంతో పాక్ 188 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ సిద్రా అమీన్ ఒంటరి పోరాటం చేసింది. టేలండర్లతో సాయంతో పాకిస్థాన్‌ను విజయం దిశగా నడిపించింది. బౌండరీలతో చెలరేగిన సిద్రా సెంచరీ చేసింది. దీంతో మహిళ వన్డే ప్రపంచకప్‌లో సెంచరీ కొట్టిన తొలి పాకిస్థాన్ క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. 48వ ఓవర్ చివరి బంతికి 104 పరుగులు చేసిన సిద్రా.. రనౌట్ కావడంతో పాకిస్తాన్ ఓటమి ఖాయం అయింది. నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి పాక్ 9 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీంతో బంగ్లా 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read: Varsha Bollamma: నాకు పెళ్లి అయ్యింది కానీ.. ప్రెగ్నెన్సీపై యంగ్ హీరోయిన్ ఏమన్నారంటే?
Also Read: Nayanthara Marriage: షాకింగ్.. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిచేసుకున్న స్టార్ హీరోయిన్! ఇదిగో సాక్షం!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook