Varsha Bollamma clarifies on her marriage and preganent rumours: టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ తాజాగా నటించిన చిత్రం 'స్టాండప్ రాహుల్'. సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్స్‌పై నంద్ కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మిస్తున్నారు. యువ హీరోయిన్ వర్ష బొల్లమ్మ నటిస్తున్న స్టాండప్ రాహుల్ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మార్చి 18న విడుదల అవుతోంది.
స్టాండప్ రాహుల్ సినిమా మార్చి 18న విడుదల కానున్న నేపథ్యంలో వర్ష బొల్లమ్మ, రాజ్ తరుణ్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజ్, వర్షలకు సంబంధించిన ఓ ఇంటర్య్వూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో వర్షను రాజ్ తరుణ్ ఇంటర్య్వూ చేస్తూ ఆటపట్టించాడు. ఈ మధ్య కాలంలో వర్ష గురించి ఎక్కువగా వార్తల్లో నిలిచిన, గూగుల్ సెర్చ్ చేసిన అంశాలపై వర్షను రాజ్ ప్రశించాడు. ఈ క్రమంలోనే పెళ్లి, ప్రెగ్నెంట్ వార్తలపై వర్ష స్పందించారు.
పెళ్లి వార్హపై వర్ష బొల్లమ్మ స్పందిస్తూ.. 'నాకు పెళ్లైయితే ఏందీ.. కాకపోతే ఏందీ. అది నా వ్యక్తిగత విషయం' అంటూ కాస్త ఫైర్ అయ్యారు. 'నాకు పెళ్లి అయ్యింది కానీ నిజంగా కాదు.. సినిమాల్లో అంటూ' ఆ తర్వాత చెప్పారు. ప్రెగ్నెంట్ విషయంపై స్పందిస్తూ.. 'ఇదంతా నా బుగ్గల వల్లే వచ్చింది. బిగ్గలు కాస్తా లావుగా ఉంటే.. ప్రగ్నెంట్ అని డిసైడ్ అవుతారా?' అంటూ రాజ్ తరుణ్ కు సమాధానం ఇచ్చారు. తాను 1996లో పుట్టానని, తన వయసు 25 అని చెప్పుకొచ్చారు. హిల్స్ వేస్తే తన ఎత్తు 6'1, లేకపోతే 5'11 అంటూ సరదాగా చెప్పగా.. వర్ష ఎత్తు 5'3, 5'4 అంటూ రాజ్ తరుణ్ అసలు నిజం చెప్పాడు.
Also Read: Nayanthara Marriage: షాకింగ్.. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిచేసుకున్న స్టార్ హీరోయిన్! ఇదిగో సాక్షం!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook