Tamim Iqbal Retirement: తమీమ్ ఇక్బాల్ షాకింగ్ నిర్ణయం.. మూడు ఫార్మాట్లకు గుడ్‌బై
Tamim Iqbal Retired From All Formats: బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన ప్రకటన చేశాడు. మూడు ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పి అందరనీ ఆశ్చర్యపరిచాడు. మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురవుతూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Tamim Iqbal Retired From All Formats: వరల్డ్ కప్‌కు ముందు బంగ్లాదేశ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించాడు వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్. మరో మూడు నెలల్లో ప్రపంచ కప్ మొదలవుతున్న నేపథ్యలో తమిమీ ఇక్బాల్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తక్షణమే మూడు ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తన నిర్ణయాన్ని తెలియజేశాడు ఈ స్టార్ ఓపెనర్.
బుధవారం (జూలై 5) ఆఫ్ఘనిస్థాన్‌తో మొదటి వన్డేలో బంగ్లాదేశ్ ఓడిపోయింది. మరుసటి రోజే (గురువారం) ఛటోగ్రామ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది తనకు క్రికెట్ కెరీర్‌కు ముగింపు అని చెప్పుకొచ్చాడు. దేశం కోసం తాను అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశానని అన్నాడు. సహచరులు, కోచ్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు. క్రికెట్ ప్రయాణంలో నిరంతరం తనతో ఉంటూ తనపై నమ్మకం ఉంచిన కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తనపై నిరంతరం ప్రేమను కురిపిస్తూ.. మరింత మెరుగ్గా ఆడేందుకు ఉత్సాహపరిచిన అభిమానులకు కూడా థ్యాంక్స్ చెప్పాడు. రిటైర్మెంట్ ప్రకటించే సమయంలో తమీమ్ భావోద్వేగానికి గురయ్యాడు.
34 ఏళ్ల తమీమ్ ఇక్బాల్ 2007లో ఫిబ్రవరి నెలలో బంగ్లాదేశ్ తరపున తన అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టాడు. అదే ఏడాది వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించి మంచి పేరు తెచ్చుకున్నాడు. బంగ్లా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేయడంతో పాటు అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్‌గా రికార్డు తమీమ్ పేరుపైనే ఉంది. దాదాపు 16 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ స్టార్ ప్లేయర్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు.
తమీమ్ 241 వన్డేలు ఆడగా.. 36.62 సగటుతో 8313 పరుగులు చేశాడు ఇందులో 14 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 70 టెస్ట్ మ్యాచ్‌లలో 38.89 సగటుతో 5134 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 70 టీ20 మ్యాచ్‌ల్లో 24.08 సగటుతో 1758 రన్స్ చేశాడు. తమీమ్ బంగ్లాదేశ్‌కు 37 వన్డేల్లో నాయకత్వం వహించాడు. ఇందులో 21 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు.
Also Read: IND Vs WI T20 Squad: టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా.. తెలుగు కుర్రాడికి చోటు
Also Read: Salaar Teaser: సలార్ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి