BCCI vs Virat Kohli: బీసీసీఐకు టీమ్ ఇండియా మేటి క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య దూరం పెరుగుతోంది. దక్షిణాఫ్రికా పర్యటన గురించి..బీసీసీఐకు నేరుగా సమాధానమిచ్చాడు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియా వన్డే కెప్టెన్‌గా, ఐపీఎల్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తొలగించిన తరువాత పరిణామాలు మారుతున్నాయి. బీసీసీఐకు, విరాట్ కోహ్లీకి మధ్య అంతరం పెరిగింది. ఇప్పుడు ఒకరికొకరికి తెలియకుండా ప్రకటనలు వెలువడుతున్నాయి. తొలుత..దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ వన్డేలు ఆడడని వచ్చిన వార్తలను బీసీసీఐ అధికారి తోసిపుచ్చారు. కోహ్లీ వన్డే సిరీస్‌లో ఆడతాడా? అని అడగ్గా.. తప్పకుండా.. కోహ్లీ వన్డే సిరీస్‌లో ఆడుతాడని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు.


టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు...బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్‌.. అలాంటిది ఏమీ లేదు. సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. వాటిని ఏమాత్రం నమ్మొద్దు. నాకు తెలిసి విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించకముందే దక్షిణాఫ్రికాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు అందుబాటులో ఉండనని చెప్పారన్నారు. ఆ తరువాత దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ పాల్గొంటాడంటూ బీసీసీఐ ప్రకటించింది. ఇప్పుడీ వ్యాఖ్యల్ని విరాట్ కోహ్లీ(Virat Kohli) తోసిపుచ్చారు. 


బీసీసీఐకు విరాట్ కోహ్లీ  సమాధానం


బీసీసీఐతో నేను మాట్లాడలేదు. బీసీసీఐ(BCCI) నాతో మాట్లాడలేదు. నాకు విశ్రాంతి కావాలి. మీటింగ్‌కు గంటన్నర ముందు నన్ను కాంటాక్ట్ చేశారు. ఆ తరువాత ఏ విధమైన సమాచారం లేదు. టెస్ట్ టీమ్ గురించి ఛీఫ్ సెలెక్టర్ చర్చించారు. నేను వన్డే కెప్టెన్ కాదని ఐదుగురు సెలెక్టర్లు చెప్పారు. మంచిది. ఇదీ బీసీసీఐకు విరాట్ ఇచ్చిన సమాధానం.



టెస్ట్ , వన్డే సిరీస్ కోసం ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ముంబైలో ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న టీమ్ ఇండియా(Team India)ఆటగాళ్లు రేపు దక్షిణాఫ్రికాకు బయలుదేరనున్నారు. డిసెంబర్ 26 నుంచి ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. 


Also read: Virat Kohli - BCCI: అవన్నీ గాలి వార్తలే.. విరాట్ కోహ్లీ వన్డే సిరీస్‌లో ఆడుతాడు: బీసీసీఐ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook