Team India: ఈ ఏడాది టెస్టుల్లో బెస్ట్ ప్లేయర్లు వీరే.. బీసీసీఐ ప్రకటన
Top Performers in Test Cricket: ఈ ఏడాది టెస్టుల్లో టీమిండియా తరుఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను బీసీసీఐ ప్రకటించింది. ఒక బౌలర్, ఒక బ్యాట్స్‌మెన్ పేరును సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరంటే..
Top Performers in Test Cricket: టీమిండియాకు ఈ ఏడాది టెస్టుల్లో పెద్దగా కలిసి రాలేదు. ఈ సంవత్సరం 7 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆడగా.. అందులో వీటిలో 4 మ్యాచ్‌ల్లో గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. టెస్టుల్లో టీమిండియా తరుఫున ఇద్దరు ఆటగాళ్లు మంచి ఆటతీరు కనబరిచారు. ఈ ఏడాది చివరి రోజున శనివారం బీసీసీఐ టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఇద్దరు పేర్లను వెల్లడించింది. రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాను బెస్ట్ టెస్ట్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ చాలా అద్భుతంగా రాణించాడు. తన ఆట తీరుతో టీమిండియాకు ఒంటి చెత్తో విజయాలు అందించాడు. ఈ ఏడాది భారత్ తరఫున పంత్ మొత్తం ఏడు టెస్టు మ్యాచ్‌లు ఆడి.. 61.81 సగటుతో 680 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ప్రస్తుతం పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం ఉదయం రూర్కీ సమీపంలో రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. అతని నుదిటిపై, చేతికి, కాలికి కూడా గాయాలయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్‌లోకి పంత్ తిరిగి వచ్చేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఏడాది గాయాలతో ఎక్కువ శాతం మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ముఖ్యంగా ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్‌కు బూమ్రా లేనిలోటు స్పష్టంగా కనిపించింది. ఈ ఏడాది 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 22 వికెట్లు తీసుకున్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో 24 పరుగులకు 5 వికెట్లు పడగొట్టడం బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ గైర్హాజరీలో బుమ్రా కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇటీవల బంగ్లా టూర్‌కు కూడా బూమ్రా దూరంగా ఉన్నాడు.
Also Read: Delhi Crime: ఢిల్లీలో దారుణ ఘటన.. విద్యార్థి ప్రైవేట్ పార్ట్‌కు దారం కట్టి..
Also Read: Interest Rate Hike: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఈ పథకాలకు వడ్డీ రేటు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి