Team India Squads For New Zealand and Australia Tours: భారత గడ్డపై న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగే వన్డే, టీ20, టెస్ట్ సిరీస్‌లకు టీమిండియా జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ నెల 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు న్యూజిలాండ్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తరువాత ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మార్చి 22 వరకు ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. కివీస్‌ టూర్‌తో పాటు ఆసీస్‌తో జరిగే మొదటి రెండు టెస్టులకు టీమ్‌ను ఎంపిక చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యూజిలాండ్‌తో వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా.. టీ20లకు మళ్లీ సీనియర్లను పక్కన పెట్టారు. హిట్‌మ్యాన్‌తో పాటు కింగ్‌ కోహ్లీని కూడా రెస్ట్ ఇచ్చారు. హార్ధిక్ పాండ్యా మళ్లీ కెప్టెన్‌గా ఎంపికవ్వగా.. సూర్యకుమార్ యాదవ్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. కివీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌ నుంచి కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ దూరం అయ్యారు. రాహుల్ పెళ్లి ఉండగా.. ఫ్యామిలీ కమిట్‌మెంట్స్‌తో అక్షర్ పటేల్ విశ్రాంతి తీసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకోలేనట్లు తెలుస్తోంది. అతని పేరు పరిగణలోకి తీసుకోలేదు. టెస్ట్ జట్టులోకి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేసినా.. ఫిట్‌నెస్ పరీక్షలో పాస్ అవ్వాల్సి ఉంటుంది. స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ను టెస్ట్ జట్టుకు ఎంపిక చేశారు.


ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఉన్న రిషబ్ పంత్ స్థానంలో టెస్టుల్లోకి ఇషాన్ కిషన్ ఎంట్రీ ఇచ్చాడు. వన్డే జట్టులోకి కేఎస్ భరత్ ఎంపికయ్యాడు. టీ20 సిరీస్‌కు డాషింగ్ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షాకు సెలెక్టర్లు చోటు కల్పించారు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గాయపడి జట్టుకు దూరమైన సంజూ శాంసన్ పేరును పట్టించుకోలేదు. అతని స్థానంలో జితేష్‌ శర్మను ఎంపిక చేశారు. పేలవ ప్రదర్శన కారణంగా టీ20 సిరీస్‌ను నుంచి హర్షల్ పటేల్‌ను కూడా తొలగించారు.   


న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.


టీ20 సిరీస్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్.


ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్.


Also Read: Pawan Kalyan Speech: నేను అన్నింటికీ తెగించిన వాడిని.. మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్‌ రియాక్షన్ ఇదే..   


Also Read: Pawan Kalyan: ఆ రోజు సినిమాలు వదిలేస్తా.. తుదిశ్వాస వరకు రాజకీయాలు వదలను: పవన్ కళ్యాణ్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి